IPL 2025 Mega Auction: పేరుకు తోపులు.. ఒక్కరూ అమ్ముడుపోలేదు.. అన్‌సోల్డ్ ప్లేయర్ల లిస్ట్ ఇదే
ABN , Publish Date - Nov 25 , 2024 | 04:02 PM
IPL 2025 Mega Auction: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా ఆక్షన్‌లో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తోపు ప్లేయర్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగలడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
జెడ్డా: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా ఆక్షన్‌లో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తోపు ప్లేయర్లు కూడా అన్‌సోల్డ్‌గా ఉండటం అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది. ఒకరు, ఇద్దరు కాదు.. చాలా మంది స్టార్లు ఆక్షన్ రెండో రోజు అమ్ముడుపోలేదు. ఇందులో యువ ఆటగాళ్ల కంటే సీనియర్ ప్లేయర్లే ఎక్కువగా ఉన్నారు. ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలంగా ఆడుతూ వస్తున్న అజింక్యా రహానెతో పాటు శార్దూల్ ఠాకూర్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా మిగిలారు. వీళ్లతో పాటు గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్ కూడా అమ్ముడుపోలేదు. ఇన్నేళ్ల నుంచి ఆడుతున్న అనుభవజ్ఞులు, ఎంతో క్రేజ్ ఉన్న ప్లేయర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. వీళ్లను కనీసం బేస్ ప్రైజ్‌కు తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించలేదు.
Also Read:
బ్రాడ్‌మన్‌ను దాటేసిన కోహ్లీ
సమరానికి నేడే ఆరంభం
ధర దద్దరిల్లింది
For More Sports And Telugu News