Share News

Yusuf vs Irfan: అన్నా బౌలింగ్‌లో సిక్సు కొట్టి సచిన్ జట్టును గెలిపించిన తమ్ముడు.. ఆ తర్వాత అతను చేసిన పనికి..

ABN , Publish Date - Jan 19 , 2024 | 02:45 PM

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లంతా కలిసి ఆడిన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు, అన్నాదమ్ములైన యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Yusuf vs Irfan: అన్నా బౌలింగ్‌లో సిక్సు కొట్టి సచిన్ జట్టును గెలిపించిన తమ్ముడు.. ఆ తర్వాత అతను చేసిన పనికి..

బెంగళూరు: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లంతా కలిసి ఆడిన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు, అన్నాదమ్ములైన యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. హోరాహోరీగా సాగిన పోరులో మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించే చివరి ఓవర్‌ను యూసుఫ్ పఠాన్ వేయగా ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ చేశాడు. చివరి రెండు బంతుల్లో 3 పరుగులు కావాల్సిన సమయంలో ఇర్ఫాన్ పఠాన్ సిక్సు కొట్టి తన జట్టును గెలిపించాడు. అనంతరం ఆ ఓవర్ బౌలింగ్ చేసిన తన అన్న యూసుఫ్ పఠాన్‌ను ఇర్ఫాన్ పఠాన్ కౌగిలించుకున్నాడు. యూసుఫ్ బౌలింగ్‌లో సిక్సు కొట్టి అతని జట్టును ఓడించినందుకు క్షమించాలంటూ వేడుకున్నట్టుగా కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ నుంచి రిటైరైన దిగ్గజ ఆటగాళ్లంతా కలిసి రెండు జట్లుగా విడిపోయి వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్‌లో ఓ టీ20 మ్యాచ్ ఆడారు. బెంగళూరులోని సాయి క్రిష్ణన్ క్రికెట్ అకాడమీ ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో వన్ వరల్డ్ జట్టుకు సచిన్, వన్ ఫ్యామిలీ జట్టుకు యువరాజ్ సింగ్ నాయకత్వం వహించారు. తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ సచిన్ టీంలో ఆడగా.. అన్న యూసుఫ్ పఠాన్ యూవీ టీంలో ఆడాడు. మొదట బ్యాటింగ్ చేసిన యూవీ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సచిన్ టీంకు చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమయ్యాయి. యూసుఫ్ పఠాన్ వేసిన ఆ ఓవర్‌లో మొదటి 4 బంతుల్లో 4 పరుగులే వచ్చాయి. చివరి 2 బంతుల్లో 3 పరుగులు అవసరం కాగా ఇర్ఫాన్ పఠాన్ సిక్సు కొట్టి తన జట్టును గెలిపించాడు. అనంతరం తనను క్షమించమన్నట్టుగా బౌలింగ్ చేసిన తన అన్న యూసుఫ్ పఠాన్‌ను కౌగిలించుకున్నాడు.

Updated Date - Jan 19 , 2024 | 02:45 PM