Share News

Cricket: ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ విధ్వంసం.. ఫ్యాన్స్‌కు పూనకాలు

ABN , Publish Date - Nov 29 , 2024 | 09:15 PM

Cricket: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ చెలరేగిపోయాడు. తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. సిక్సుల వర్షం కురిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.

Cricket: ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ విధ్వంసం.. ఫ్యాన్స్‌కు పూనకాలు

SMAT 2024: టీమిండియా డాషింగ్ లెఫ్టాండర్ ఇషాన్ కిషన్ మరోమారు సత్తా చాటాడు. తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. సిక్సుల వర్షం కురిపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఇషాన్. ప్రత్యర్థి బౌలర్లను అతడు ఊచకోత కోశాడు. బౌలర్లను వరుసబెట్టి దంచికొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు.


భారీ సిక్సులు

అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను చావబాదాడు ఇషాన్ కిషన్. 23 బంతుల్లోనే ఏకంగా 77 పరుగులు చేశాడు. 5 బౌండరీలు బాదిన స్టార్ వికెట్ కీపర్.. 9 భారీ సిక్సులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ వల్లే మ్యాచ్ 4.3 ఓవర్లలోనే ముగిసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌట్ అయింది. అనుకూల్ రాయ్, రవి యాదవ్ చెలరేగి బౌలింగ్ చేశారు. అనుకూల్ 4 వికెట్లు తీయగా.. రవి 3 వికెట్లతో ప్రత్యర్థుల భరతం పట్టాడు. చిన్న లక్ష్యాన్ని జార్ఖండ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది.


ఊచకోత కంటిన్యూ

ఇషాన్ (77 నాటౌట్)తో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్ (13 నాటౌట్) టీమ్‌ను కూల్‌గా విజయతీరాలకు చేర్చారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా గెలిచింది జార్ఖండ్. ఈ మ్యాచ్‌లో ఇషాన్ బ్యాటింగ్ చేసిన తీరు, భారీ షాట్లు ఆడిన విధానం, మంచి బంతుల్ని కూడా సిక్సులుగా మలచిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇది కదా మేం కోరుకున్నది అంటున్నారు సన్‌రైజర్స్ ఫ్యాన్స్. ఈ ఊచకోత ఇలాగే కొనసాగించు... పూనకాలు తెప్పిస్తూనే ఉండమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఇషాన్‌ను రూ.11.25 కోట్లు చెల్లించి సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.


Also Read:

టీమిండియా కొత్త జెర్సీపై విమర్శలు.. బీసీసీఐ చేసిన తప్పేంటి..

పాపం.. 25 ఏళ్లకే కెరీర్ క్లోజ్

పంత్, అయ్యర్ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక ప్యాకేజ్ ఇతడికే..

For More Sports And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 09:29 PM