Share News

Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బుమ్రా.. అశ్విన్ సరసన పేసుగుర్రం

ABN , Publish Date - Dec 25 , 2024 | 07:27 PM

Boxing Day Test: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఎన్నో అరుదైన ఘనతల్ని సొంతం చేసుకున్న బుమ్రా.. తాజాగా మరో రేర్ ఫీట్ చేశాడు. ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరసన చోటు దక్కించుకున్నాడు.

Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బుమ్రా.. అశ్విన్ సరసన పేసుగుర్రం
Jasprit Bumrah

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు రికార్డులు కొత్త కాదు. నిలకడైన బౌలింగ్‌తో వరల్డ్ క్లాస్ బ్యాటర్లను కూడా భయపెడుతున్న బుమ్రా.. పాత రికార్డులకు పాతర పెడుతున్నాడు. ఫార్మాట్లకు అతీతంగా అద్భుతంగా ఆడుతూ వస్తున్న ఈ స్పీడ్‌స్టర్.. సరదా సరదాకే రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. నీళ్లు తాగినంత ఈజీగా భారీ మైలురాళ్లను దాటేస్తున్నాడు. అలాంటోడు మరో రేర్ ఫీట్ నమోదు చేశాడు. చరిత్ర సృష్టించిన బుమ్రా.. లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరసన చోటు దక్కించుకున్నాడు. అతడు సాధించిన ఆ ఘనత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..


కొత్త రికార్డు..

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో 904 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు బుమ్రా. అతడి తర్వాతి స్థానంలో సౌతాఫ్రికా సీమర్ కగిసో రబాడ (856 పాయింట్లు) ఉన్నాడు. టాప్‌-5 బౌలర్లలో ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ (789 పాయింట్లు) కూడా చోటు దక్కించుకున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (755 పాయింట్లు) నాలుగు స్థానాలు దిగజారి పదో పొజిషన్‌లో నిలిచాడు. అయితే ర్యాంకింగ్స్ పరంగా బుమ్రా కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. టెస్టు క్రికెట్‌లో హయ్యెస్ట్ రేటింగ్ నమోదు చేసిన బౌలర్ల లిస్ట్‌లో బుమ్రా చోటు దక్కించుకున్నాడు.


బ్రేక్ చేస్తాడా?

టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు కలిగిన రికార్డు ఇంగ్లండ్ బౌలర్ సిడ్నీ బర్నెస్ (932 రేటింగ్ పాయింట్లు) పేరు మీద ఉంది. 900 రేటింగ్ పాయింట్ల క్లబ్‌లో ఆల్రెడీ ఓ టీమిండియా నుంచి అశ్విన్ ఉన్నాడు. 2016లో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ టైమ్‌లో అతడు ఆ క్లబ్‌లో అడుగు పెట్టాడు. ఇప్పుడు బీజీటీ సిరీస్‌తో బుమ్రా కూడా అరుదైన ప్లేయర్ల జాబితాలో నిలిచాడు. ఓవరాల్‌గా 900 రేటింగ్ పాయింట్ల ఫీట్‌ను అందుకున్న 26వ బౌలర్‌గా పేసుగుర్రం రికార్డు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం 904 పాయింట్లతో ఉన్న బుమ్రా.. హయ్యెస్ట్ రేటింగ్ బౌలర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఆసీస్ టూర్‌లో మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. అశ్విన్‌తో సమంగా ఉన్న బుమ్రా.. ఈ రెండు టెస్టుల్లో వికెట్ల ఊచకోత కోస్తే ఏదైనా సాధ్యమే. అతడు ఈ రేర్ ఫీట్‌ను బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Also Read:

కూతురితో కలసి క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఈ టీమిండియా స్టార్‌ను

74 ఏళ్ల సంప్రదాయం.. బాక్సింగ్ డే టెస్ట్‌‌ ఎందుకంత స్పెషల్ అంటే..

బాక్సింగ్ డే టెస్ట్.. 2 కీలక మార్పులతో బరిలోకి రోహిత్ సేన

ఆసీస్ టీమ్‌లోకి జూనియర్ పాంటింగ్.. వీడు మామూలోడు కాదు

For More Sports And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 07:27 PM