Share News

KL Rahul: కావాలనే బయటకొచ్చేశా.. నా టార్గెట్ అదే: కేఎల్ రాహుల్

ABN , Publish Date - Nov 12 , 2024 | 01:04 PM

KL Rahul: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎవరితోనూ పెద్దగా ఇంటరాక్షన్ కాడు. ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉండే రాహుల్.. వివాదాలకు ఛాన్స్ ఇవ్వడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తనదైన స్టైల్‌లో హ్యాండిల్ చేస్తాడు.

KL Rahul: కావాలనే బయటకొచ్చేశా.. నా టార్గెట్ అదే: కేఎల్ రాహుల్

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎవరితోనూ పెద్దగా ఇంటరాక్షన్ కాడు. ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉండే రాహుల్.. వివాదాలకు ఛాన్స్ ఇవ్వడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తనదైన స్టైల్‌లో హ్యాండిల్ చేస్తాడు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా అగ్రెసివ్‌గా గాకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకునే రకం. అలాంటోడు హఠాత్తుగా టీమ్ మారాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అసలు రాహుల్ ఎందుకీ డెసిషన్ తీసుకున్నాడనే చర్చ జరుగుతోంది. దీనిపై స్వయంగా అతడే క్లారిటీ ఇచ్చాడు. తాను కావాలనే బయటకొచ్చేశానని అన్నాడు. ఇక మీదట అదే తన టార్గెట్ అని చెప్పాడు. ఇంతకీ రాహుల్ చెప్పిన ఆ రీజన్ ఏంటి? ఎందుకు జట్టు మారుతున్నాడనేది ఇప్పుడు చూద్దాం..


అదొక్కటే కోరుకుంటున్నా

ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జియాంట్స్ నుంచి రాహుల్ బయటకు వచ్చేశాడు. త్వరలో జరిగే మెగా వేలంలో అతడు పోటీపడబోతున్నాడు. దీంతో వచ్చే సీజన్‌లో అతడు కొత్త జట్టుకు ఆడటం ఖరారైంది. అయితే కెప్టెన్సీ ఇచ్చి ఎంకరేజ్ చేసిన టీమ్‌ను రాహుల్ ఎందుకు వీడాడు? ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో వివాదం కారణంగానే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడా? అనేది క్లారిటీ రాలేదు. దీనిపై ఎట్టకేలకు రాహుల్ స్పష్టతనిచ్చాడు. ఐపీఎల్‌లో తన ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టాలని అనుకున్నానని అన్నాడు. తాను స్వేచ్ఛ కోరుకున్నానని చెప్పాడు.


నా టార్గెట్ అదే

‘కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకున్నా. నూతన అవకాశాలను వెతకాలని భావించా. నాకు ఫ్రీడమ్ దొరికే చోట ఆడాలని కోరుకున్నా. కొన్నిసార్లు దూరంగా వెళ్లడమే కరెక్ట్. అప్పుడే మనకు కావాల్సింది దొరుకుతుంది. టీమ్ ఎన్విరాన్‌మెంట్ తేలికగా ఉంటుంది. కొన్నాళ్లుగా నేషనల్ టీ20 టీమ్‌కు దూరంగా ఉన్నా. ప్లేయర్‌గా నా కెపాసిటీ ఏంటో తెలుసు. మళ్లీ మునుపటి స్థాయికి చేరుకోవడానికి ఏం చేయాలో కూడా క్లారిటీ ఉంది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. భారత టీ20 జట్టులో బెర్త్ సంపాదించడమే టార్గెట్‌గా పెట్టుకున్నా. ఇక మీదట ఇదే లక్ష్యంగా ఆడతా’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒక మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్‌పై సీరియస్ అయ్యాడు ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా. స్టేడియంలో అందరూ చూస్తుండగానే ఇలా చేయడం వివాదానికి దారితీసింది.


Also Read:

వరల్డ్ క్రికెట్‌కు షాక్.. పాకిస్థాన్‌పై బ్యాన్.. చేజేతులా చేసుకున్నారు

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్

సౌతాఫ్రికాతో మూడో టీ20.. 2 మార్పులతో బరిలోకి భారత్

For More Sports And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 01:07 PM