LSG vs PBKS: టాస్ గెలిచిన లఖ్‌నవూ.. తుది జట్లు ఇవే!
ABN , Publish Date - Mar 30 , 2024 | 07:06 PM
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ముందుగా ఫీల్డింగ్ చేయనుంది.
లక్నో: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ (Lucknow Super Giants vs Punjab Kings) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ నికోలస్ పూరన్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ముందుగా ఫీల్డింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) తుది జట్టులో ఆడడం లేదు. దీంతో అతని స్థానంలో నికోలస్ పూరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రాహుల్ తుది జట్టులో ఆడకపోయినప్పటికీ ఇంపాక్టు ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగుతాడని టాస్ సమయంలో కెప్టెన్ పూరన్ చెప్పాడు. టాస్ సమయంలో పూరన్ మాట్లాడుతూ.. ‘‘కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని ఈ టోర్నీ ఆడుతున్నాడు. అందుకే ఈ సుదీర్ఘ టోర్నీలో రాహుల్‌కు విశ్రాంతి ఇవ్వాలను భావించాం. అందుకే అతను ఈ రోజు తుది జట్టులో లేడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేస్తాడు.’’ అని చెప్పాడు.
ఇక పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే ఈ మ్యాచ్ లో తమ తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరొకటి ఓడిన పంజాబ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఆడిన ఒక మ్యాచ్‌లో ఓడిన లఖ్‌నవూ చిట్ట చివరన పదో స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్ చరిత్రలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రెండింటిలో లఖ్‌నవూ, ఒక దాంట్లో పంజాబ్ గెలిచాయి.
IPL 2024: మైలురాయిని చేరుకున్న ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో జట్టుగా..
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, నికోలస్ పూరన్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024: గంభీర్-కోహ్లీకి ఆస్కార్ ఇవ్వాలి.. దిగ్గజ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు