Share News

Rohit-Rahul: రోహిత్ వారసుడిగా రాహుల్.. ఆ టెక్నిక్ పట్టేస్తే తిరుగుండదు

ABN , Publish Date - Nov 20 , 2024 | 06:59 PM

Rohit-Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బిగ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. ఆస్ట్రేలియాతో పోరుకు అతడు సిద్ధమవుతున్నాడు. బీజీటీలో దుమ్మురేపాలని అతడు పట్టుదలతో ఉన్నాడు.

Rohit-Rahul: రోహిత్ వారసుడిగా రాహుల్.. ఆ టెక్నిక్ పట్టేస్తే తిరుగుండదు

IND vs AUS: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బిగ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. ఆస్ట్రేలియాతో పోరుకు అతడు సిద్ధమవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దుమ్మురేపాలని అతడు పట్టుదలతో ఉన్నాడు. జట్టుకు తానెంత కీలకమో బ్యాట్‌తోనే ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. ఒకట్రెండు మ్యాచుల్లో ఫెయిలైనంత మాత్రాన టీమ్‌ నుంచి తనను దూరం పెట్టడం కరెక్ట్ కాదని నిరూపించాలని భావిస్తున్నాడు. అయితే ఇది మాత్రమే కాదు.. రాహుల్ ముందు మరో లక్ష్యం కూడా ఉంది. రోహిత్ శర్మ వారసుడ్ని తానేనని అతడు ప్రూవ్ చేయాలి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


నీళ్లు తాగినంత ఈజీగా..

ప్రస్తుత భారత టెస్ట్ జట్టులో స్ట్రోక్ ప్లేయర్ అంటే కెప్టెన్ రోహిత్ శర్మ పేరే ముందు గుర్తుకొస్తుంది. రిషబ్ పంత్ లాంటి వాళ్లు కూడా ఉన్నా అతడ్ని పించ్ హిట్టింగ్ కేటగిరీలో పెట్టాల్సి ఉంటుంది. కానీ రోహిత్ అలా కాదు.. క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొడతాడు. బుక్ షాట్స్‌తో పాటు ఇంప్రువైజ్ చేస్తూ బౌలర్లపై విరుచుకుపడతాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో టెస్టులను కూడా టీ20ల్లా మార్చేస్తాడు. నిల్చున్న చోటు నుంచే నీళ్లు తాగినంత అలవోకగా భారీ సిక్సులు బాదేస్తాడు. లాంగ్ ఫార్మాట్‌లో అతడిలా స్ట్రోక్స్ ఆడుతూ బౌలర్లను బ్యాక్ సీట్‌లోకి నెట్టడంలో రాహుల్ నేర్పరి. అయితే గత కొన్నాళ్లుగా అతడు బ్యాడ్ ఫామ్‌తో బాధపడుతున్నాడు. టీమ్‌లో చోటు కోసం ఇబ్బందులు పడుతున్నాడు.


ఆసీస్ బెండు తీయాలి

రోహిత్ ఇంకెన్నాళ్లు టెస్టుల్లో కంటిన్యూ అవుతాడో కచ్చితంగా చెప్పలేం. బీజీటీలో గనుక ఫెయిలైతే అతడిపై వేటు పడటం ఖాయమని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పెర్త్ టెస్ట్‌లో హిట్‌మ్యాన్ ప్లేసులో ఓపెనర్‌గా దిగుతున్న కేఎల్ రాహుల్ ఆ ఛాన్స్‌ను అందిపుచ్చుకోవాలని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో ఆసీస్‌ బెండు తీయాలని సూచిస్తున్నారు. ఓపెనింగ్‌లో రోహిత్ వారసుడ్ని తానేనని అతడు ప్రూవ్ చేసుకోవాలని చెబుతున్నారు. అందుకు ఓ టెక్నిక్‌ను అతడు పట్టేస్తే సరిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.


అదొక్కటే దారి

రాహుల్ బేసిక్స్ మీద ఫోకస్ చేయాలని కంగారూ లెజెండ్ మాథ్యూ హేడెన్ సూచించాడు. ఒక బాల్‌కు వేర్వేరు షాట్స్ ఆడే సామర్థ్యం ఉన్న అతికొద్ది మంది ఆటగాళ్లలో రాహుల్ ఒకడని.. అయితే ఫామ్ అందుకోవాలంటే ఇది పనికి రాదన్నాడు. అతడు తన గేమ్ తాను ఆడితే సరిపోతుందన్నాడు. బాల్ మెరిట్‌ను బట్టి సింపుల్‌ గేమ్ ఆడితే చాలని.. అనవసర ప్రయోగాలు అక్కర్లేదని వారించాడు. ఈ టెక్నిక్ అర్థం చేసుకుంటే అతడికి ఢోకా ఉండదన్నాడు హేడెన్. క్రీజులో ఎక్కువ సేపు గడపడం మీద దృష్టి పెట్టాలని.. లాంగ్ ఫార్మాట్‌లో నెగ్గుకు రావాలంటే అదొక్కటే దారి అన్నాడు.


Also Read:

కయ్యానికి కాలు దువ్వుతున్న కోహ్లీ.. పక్కా ప్లానింగ్‌తోనే ముందుకు..

హార్దిక్ పాండ్యాకు ఘోర అవమానం.. పగబట్టి మరీ చేశారుగా

దూసుకొచ్చిన తిలక్ వర్మ.. సూర్యకుమార్ స్థానానికి ఎసరు పెట్టిన యంగ్ ప్లేయర్

For More Sports And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 07:05 PM