MS Dhoni: తన సూపర్ ఫామ్ వెనుక అసలు రహస్యం రివీల్ చేసిన ధోనీ
ABN , Publish Date - Apr 28 , 2024 | 04:18 PM
గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. క్రీజులోకి రావడం రావడంతోనే భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 44 ఏళ్ల వయసులో..
గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో (IPL 2024) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మంచి ఫామ్‌లో ఉన్నాడు. క్రీజులోకి రావడం రావడంతోనే భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 44 ఏళ్ల వయసులో 26 ఏళ్ల యువకుడిలాగా చెలరేగి ఆడుతున్నాడు. తాను ఆడేది తక్కువ బంతులే అయినా.. తనదైన ఇంపాక్ట్ చూపిస్తూ, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. ధోనీ అద్భుత ప్రదర్శన వెనుక గల కారణాలేంటి? అని చర్చించుకోవడం మొదలుపెట్టాడు. ఈ రహస్యాన్ని ధోనీ తాజాగా రివీల్ చేశాడు.
రియల్‌గా మారిన రీల్ లైఫ్.. రోబోతో పెళ్లికి సిద్ధమైన భారత ఇంజనీర్
ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత తన టైమ్-టేబుల్‌లో చాలా మార్పు వచ్చిందని, సాధారణంగా పడుకునే సమయం కన్నా తాను ఆలస్యంగా పడుకోవడం మొదలుపెట్టానని ధోనీ పేర్కొన్నాడు. సాధారణ వ్యక్తుల సమయం 10-6 లేదా 11-7 గంటల మధ్య ఉంటుందని.. కానీ ఐపీఎల్ మ్యాచ్‌ల కారణంగా తాను రాత్రి 3 గంటలకి పడుకొని, ఉదయం 11 గంటలకు లేస్తున్నానని తెలిపాడు. ఐపీఎల్ ప్రారంభం అవ్వడానికి ఐదారు రోజుల ముందు నుంచే తానిలా ఆలస్యంగా పడుకోవడం అలవాటు చేసుకున్నానని చెప్పాడు. ఎప్పుడు నిద్రపోయినా.. కనీసం 8 గంటల నిద్రను తాను పూర్తి చేస్తానని అన్నాడు. తనకు ఎప్పుడూ అలసటగా అనిపించలేదని చెప్పుకొచ్చాడు.
రిషభ్ పంత్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఒక మ్యాచ్ నిషేధం.. ఎందుకంటే?
తమ మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 11:30 అవుతుందని, పోస్ట్ ప్రెజెంటేషన్ తర్వాత కిట్ బ్యాగ్‌ని ప్యాక్ చేసుకొని డిన్నర్ చేసేందుకు మరింత ఆలస్యమవుతుందని ధోనీ చెప్పాడు. అన్నీ ముగించుకొని హోటల్‌కి అర్థరాత్రి 1:00 గంటలకు చేరుకుంటామని.. ఆ తర్వాత ఇతర పనులు ముగించుకునేసరికి 2:30 అవుతుందని వెల్లడించాడు. ఇలా తాను రోజూ రాత్రి 3:00 గంటలకు నిద్రపోవాల్సి వస్తోందని.. అయితే ఆలస్యంగా పడుకున్నా తానెప్పుడూ టైర్డ్‌గా ఫీలవ్వలేదని అన్నాడు. 8 గంటల నిద్ర మాత్రం ముఖ్యమని నొక్కి చెప్పిన ధోనీ.. తానెప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటానని వెల్లడించాడు.
Read Latest Sports News And Telugu News