Nitish Kumar Reddy: సచిన్‌ను గుర్తుచేసిన తెలుగోడు.. సేమ్ టు సేమ్
ABN , Publish Date - Dec 06 , 2024 | 03:14 PM
Nitish Kumar Reddy: క్రికెట్ బుక్‌లోని ప్రతి షాట్ ఆడటం కొందరు ప్లేయర్లకే సాధ్యం. అలాంటి అరుదైన ఆటగాళ్లలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఒకడు. అలాంటి సచిన్‌ను గుర్తుకుతెచ్చాడు తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి.
IND vs AUS: క్రికెట్ బుక్‌లోని ప్రతి షాట్ ఆడటం కొందరు ప్లేయర్లకే సాధ్యం. అలాంటి అరుదైన ఆటగాళ్లలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఒకడు. సుదీర్ఘ కెరీర్‌లో మాస్టర్ బ్లాస్టర్ ఆడని షాట్ లేదంటే అతిశయోక్తి కాదు. అప్పర్ కట్ వంటి కొన్ని వినూత్న షాట్స్ అతడి బ్యాట్ నుంచి వచ్చినవే. అయితే సచిన్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది రెండే షాట్లు. ఒకటి స్ట్రయిట్ డ్రైవ్, రెండోది కవర్ డ్రైవ్. చాలా మంది ప్లేయర్లు ఈ షాట్స్ ఆడినా.. సచిన్ అంత అందంగా, ఈజ్‌తో కొట్టేవాళ్లు మాత్రం లేరు. అలాంటి ఓ సచిన్ షాట్‌ను రిపీట్ చేశాడు తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి. ఆ షాట్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
అచ్చం సచిన్‌లా..
లెజెండ్ సచిన్‌ను గుర్తుకుతెచ్చాడు నితీష్ రెడ్డి. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో నితీష్ ఓ అద్భుతమైన షాట్ ఆడాడు. కంగారూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో నితీష్ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ కొట్టాడు. గుడ్ లెంగ్త్‌లో పడి బౌన్స్ అవుతున్న బంతిని వెంటనే పిక్ చేసుకున్న నితీష్.. బంతిని అంతే ఒడుపుతో ఆఫ్ సైడ్ తరలించాడు. బాల్‌ను అతడు టైమింగ్ చేసిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. నితీష్ హెడ్ పొజిషన్, ఫీట్ మూమెంట్ సూపర్బ్ అనే చెప్పాలి.
వాటే టైమింగ్
నితీష్ టైమింగ్ దెబ్బకు బాల్ కవర్స్ ఫీల్డర్‌ను దాటుకొని బౌండరీ దిశగా రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. దీంతో కమిన్స్ సహా కంగారూ ఫీల్డర్లంతా అవాక్కయ్యారు. భీకర వేగంతో వచ్చిన బంతిని అతడు తక్కువ సమయంలో అంచనా వేసి పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఫోర్ కొట్టిన తీరుకు అంతా ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాట్‌ను చూసిన నెటిజన్స్ తెలుగోడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. భలే ఆడావ్ బాస్.. సచిన్‌ను గుర్తుచేశావంటూ మెచ్చుకుంటున్నారు. కాగా, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నితీష్ 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 42 పరుగులు చేశాడు. భారత్ 180 పరుగులకు ఆలౌట్ అవగా.. టీమ్‌లో తెలుగోడే హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలవడం గమనార్హం.
Also Read:
ఆసీస్‌కు పోయించిన తెలుగోడు.. కెరీర్‌లో మర్చిపోని ఇన్నింగ్స్
జేబులో కర్చీఫ్‌తో బ్యాటింగ్.. గిల్ ఎందుకిలా చేశాడో తెలుసా..
ప్రతీకారం తీర్చుకున్న స్టార్క్.. చెప్పి మరీ కొట్టాడుగా..
కేఎల్ రాహుల్ చేసిన పనికి.. క్షణాల్లో ఆవిరైన ఆస్ట్రేలియా ఆనందం.. వీడియో
For More Sports And Telugu News