Share News

Ashwin-Cummins: అశ్విన్‌కు కమిన్స్ స్పెషల్ గిఫ్ట్.. మనసులు గెలిచిన ఆసీస్ కెప్టెన్

ABN , Publish Date - Dec 19 , 2024 | 09:42 AM

Ashwin-Cummins: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడు. జెంటిల్మన్ గేమ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.

Ashwin-Cummins: అశ్విన్‌కు కమిన్స్ స్పెషల్ గిఫ్ట్.. మనసులు గెలిచిన ఆసీస్ కెప్టెన్
Ravichandran Ashwin

IND vs AUS: నిఖార్సయిన స్పిన్‌తో ప్రత్యర్థుల భరతం పట్టేటోడు, బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించేవాడు, ఒక్క స్పెల్‌తోనే మ్యాచ్‌ను మలుపు తిప్పేటోడు, రియల్ మ్యాచ్ విన్నర్, గ్రేట్ స్పిన్ ఆల్‌రౌండర్, దిగ్గజ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడు. జెంటిల్మన్ గేమ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. ఇంకొన్నాళ్లు ఆడే సత్తా ఉన్నా అశ్విన్ సడన్‌గా రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటని షాక్ అవుతున్నారు. మాజీ క్రికెటర్లు, అనలిస్టులు అతడికి హ్యాపీ రిటైర్మెంట్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు.


స్పెషల్ గిఫ్ట్

గబ్బా టెస్ట్ ముగిశాక అశ్విన్‌ను కలిశాడు కమిన్స్. భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన కమిన్స్.. లెజెండరీ స్పిన్నర్‌కు ఓ జెర్సీని గిఫ్ట్‌గా అందజేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంతకాలతో కూడిన టీ-షర్ట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్.. నువ్వు గ్రేట్ అంటూ అశ్విన్‌ను మెచ్చుకున్నాడు కంగారూ కెప్టెన్. ఆ టైమ్‌లో కమిన్స్ వెనుకే వచ్చిన నాథన్ లియాన్ కూడా అశ్విన్‌ను కలిశాడు. అతడ్ని హగ్ చేసుకున్నాడు. వాళ్లిద్దరితో కాసేపు ముచ్చటించాక డ్రెస్సింగ్ రూమ్ లోపలకు వెళ్లాడు అశ్విన్.


అశ్విన్ ఎమోషనల్

అశ్విన్ రాకను గమనించి టీమ్ ప్లేయర్లు అంతా ఒకచోట గుమిగూడారు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఫుల్ ఎమోషనల్‌గా కనిపించారు. వాళ్లు కన్నీళ్లను ఆపుకుంటూ కనిపించారు. ఈ తరుణంలో అశ్విన్ భావోద్వేగభరితంగా మాట్లాడాడు. కెరీర్ మొదట్లో ఆసీస్‌కు వచ్చానని.. నిన్న మొన్నే జరిగినట్లు అనిపిస్తోందని అన్నాడు. ఎంతటి ప్లేయర్‌కు అయినా టైమ్ వస్తుందని.. తాను నిష్క్రమించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు అశ్విన్. గత నాలుగైదేళ్లుగా టీమ్ సభ్యులతో చాలా మంచి బాండింగ్ ఏర్పడిందన్నాడు.


Also Read:

నాడు ధోనీ.. నేడు అశ్విన్‌

రిటైర్మెంట్‌కిదా సమయం: సన్నీ

భావోద్వేగ వీడ్కోలు..

For More Sports And Telugu News

Updated Date - Dec 19 , 2024 | 09:42 AM