IND vs AUS: చిత్తుగా ఓడినా ఆసీస్ పొగరు తగ్గలేదు.. వీళ్లకు రోహితే కరెక్ట్ మొగుడు
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:33 PM
IND vs AUS: ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీమిండియా. సొంతగడ్డపై పులులం, మమ్మల్ని ఓడించలేరు అంటూ ఓవరాక్షన్ చేసిన ఆతిథ్య జట్టును చావుదెబ్బ తీసింది భారత్. పెర్త్ టెస్ట్‌లో ఆ జట్టుకు ఎర్త్ పెట్టింది.
పెర్త్: ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీమిండియా. సొంతగడ్డపై పులులం, మమ్మల్ని ఓడించలేరు అంటూ ఓవరాక్షన్ చేసిన ఆతిథ్య జట్టును చావుదెబ్బ తీసింది భారత్. పెర్త్ టెస్ట్‌లో ఆ జట్టుకు ఎర్త్ పెట్టింది. ఏకంగా 295 పరుగుల భారీ తేడాతో కంగారూలను ఓడించింది బుమ్రా సేన. టీమిండియా నిర్దేశించిన 534 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 238 పరుగులకే పరిమితమైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే మ్యాచ్‌లో చిత్తుగా ఓటమిపాలైనా ఆసీస్ పొగరు తగ్గకపోవడం గమనార్హం.
పోయేదేం లేదు
ఆస్ట్రేలియా గురించి తెలిసిందే. క్రికెట్‌లో ఎప్పుడూ డామినేషన్ చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటుందా టీమ్. కింద పడినా తనదే గెలుపు అని వాదించడం వాళ్లకు బాగా అలవాటు. మరోసారి తన అసలు రూపం చూపెట్టింది ఆసీస్. పెర్త్ టెస్ట్‌లో్ ఏకంగా 295 పరుగుల తేడాతో దారుణంగా ఓటమిపాలైనా ఆ జట్టు పొగరు, బిల్డప్ మాత్రం తగ్గలేదు. దీనికి సారథి ప్యాట్ కమిన్స్ మాటలే కారణమని చెప్పొచ్చు. ఫస్ట్ టెస్ట్ ముగిశాక అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన తమకు పోయేదేమీ లేదని కమిన్స్ అన్నాడు.
మేమే నంబర్ వన్
‘మాది వరల్డ్ నంబర్ వన్ టీమ్. ఈ మ్యాచ్‌లో ఓడినా మాదే ప్రపంచ క్రికెట్‌లో అగ్ర జట్టు. ఈ ఒక్క ఓటమి దేన్నీ మార్చలేదు. ఒక వారం మేం సరిగ్గా ఆడలేదు. అంతమాత్రాన అదే అంతా నిర్ణయిస్తుందని అనడం కరెక్ట్ కాదు’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. అడిలైడ్ వేదికగా జరిగే సెకండ్ టెస్ట్‌లో తాము తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతామని పేర్కొన్నాడు. టీమిండియాను ఓడించి సిరీస్‌ను సమం చేస్తామని స్పష్టం చేశాడు. కమిన్స్ కామెంట్స్ విన్న నెటిజన్స్.. ఆసీస్ పొగరు తగ్గలేదని సీరియస్ అవుతున్నారు. భారత్ బాగా ఆడిందనే మాటను అతడు ఒప్పుకోలేకపోవడం సరికాదని ఫైర్ అవుతున్నారు. తాము సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయామని అతడు చెప్పట్లేదని.. ఎంతసేపు నంబర్ వన్ ట్యాగ్‌నే నెత్తిన వేసుకొని ఓవరాక్షన్ చేయడం ఆసీస్‌కు అలవాటైందని చెబుతున్నారు. ఆసీస్‌కు రోహితే కరెక్ట్ మొగుడు అని.. అతడు ఉంటే మళ్లీ నోరెత్తరని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో విక్టరీతో డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ తిరిగి టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
Also Read:
బ్రాడ్‌మన్‌ను దాటేసిన కోహ్లీ
సమరానికి నేడే ఆరంభం
ధర దద్దరిల్లింది
For More Sports And Telugu News