Share News

T20 World Cup 2024: భారత ఆటగాళ్లకు ప్రధాని మోదీ ఫోన్ కాల్.. కోచ్ ద్రావిడ్‌కు ప్రత్యేక అభినందనలు

ABN , Publish Date - Jun 30 , 2024 | 03:55 PM

టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడిన టీమిండియా ఆటగాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ప్రపంచ కప్‌ను సాధించిన ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ఇక రెండున్నరేళ్ల పాటు టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్‌కు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

T20 World Cup 2024: భారత ఆటగాళ్లకు ప్రధాని మోదీ ఫోన్ కాల్.. కోచ్ ద్రావిడ్‌కు ప్రత్యేక అభినందనలు

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడిన టీమిండియా ఆటగాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ప్రపంచ కప్‌ను సాధించిన ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ఇక రెండున్నరేళ్ల పాటు టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్‌కు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు వెల్లడించారు. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీకి అభినందనలు అని పేర్కొన్నారు. ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడని ప్రశంసించారు.


డియర్ రోహిత్.. కెప్టెన్‌కు మోదీ ప్రత్యేక అభినందనలు

కాగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లకు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘డియర్ రోహిత్ శర్మ’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ‘‘ నువ్వు అద్భుతమైన పరిణితి చెందిన ఆటగాడివి. నీ దూకుడు స్వాభావం, దూకుడు బ్యాటింగ్, కెప్టెన్సీలు భారత జట్టును రూపాంతరం చెందించాయి. నీ టీ20 కెరీర్‌ను ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ రోజు నీతో మాట్లాడినందుకు ఆనందంగా ఉంది’’ అంటూ ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు.


విరాట్.. టీ20 క్రికెట్ నిన్ను కోల్పోతుంది: మోదీ

‘‘నీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది విరాట్. ఫైనల్స్‌లో ఆడిన ఇన్నింగ్స్‌ లాంటి బ్యాటింగ్‌తో నువ్వు భారత జట్టు బ్యాటింగ్‌ను అద్భుతంగా ప్రోత్సాహించావు. అన్ని ఫార్మాట్లలోనూ రాణించాయి. టీ20 క్రికెట్ మిమ్మల్ని కోల్పోతుంది. కానీ కొత్త తరం ఆటగాళ్లను నువ్వు ప్రోత్సహిస్తూనే ఉంటాని నేను విశ్వసిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.


ద్రావిడ్ వరల్డ్ కప్‌ను పైకెత్తడం సంతోషం కలిగిస్తోంది: మోదీ ప్రశంస

కాగా టీమిండియా 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో రాహుల్ ద్రావిడ్‌ను కూడా మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ‘‘రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన కోచింగ్ ప్రయాణం భారత క్రికెట్‌ జట్టును విజయవంతమైన టీమ్‌గా రూపొందించింది. ద్రావిడ్ అచంచలమైన అంకితభావం, వ్యూహాత్మక ఆలోచనలు, సరైన ప్రతిభను వెలికి తీసే నైపుణ్యాలు జట్టును రూపాంతరం చెందించాయి. వరల్డ్ కప్ గెలవడంతో రాహుల్ ద్రావిడ్ అందించిన సహకారం భారత్ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది. ఇక ఆయన సేవలు తరాలకు స్ఫూర్తినిస్తాయి. రాహుల్ ద్రావిడ్ వరల్డ్ కప్‌ ట్రోఫీని పైకిఎత్తడం చాలా సంతోషం కలిగిస్తోంది. ద్రావిడ్‌కు అభినందనలు తెలపడం సంతోషంగా ఉంది’’ అని ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎక్కడ కోల్పోయాడో అక్కడే సాధించిన ద్రవిడ్.. 16 ఏళ్ల క్రితం విండీస్‌లో ఏం జరిగిందంటే..

వివాదంలో సూర్యకుమార్ క్యాచ్.. అంపైర్లపై సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఆగ్రహం

For More Sports News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 04:01 PM