AFG vs BAN: సచిన్, కోహ్లీ రికార్డు బ్రేక్.. ఆఫ్ఘాన్ క్రికెటర్ సరికొత్త చరిత్ర
ABN , Publish Date - Nov 12 , 2024 | 02:45 PM
AFG vs BAN: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్, మోడర్న్ మాస్టర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును ఒక ఆఫ్ఘానిస్థాన్ క్రికెటర్ బ్రేక్ చేశాడు. అతడు చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
Rahmanullah Gurbaz: ఆఫ్ఘానిస్థాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ చరిత్ర సృష్టించాడు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును అతడు బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 8 సెంచరీలు నమోదు చేసిన రెండో అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు గుర్బాజ్. 120 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇది వన్డేల్లో అతడికి ఎనిమిదో సెంచరీ కావడం గమనార్హం.
రెండో స్థానంలోకి..
గుర్బాజ్ 22 సంవత్సరాల 349 రోజుల వయసులో తన 8వ వన్డే సెంచరీ కొట్టాడు. దీంతో సచిన్ (22 సంవత్సరాల 357 రోజులు)ను ఈ ఆఫ్ఘాన్ వికెట్ కీపర్ దాటేసి రెండో ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. ఈ లిస్ట్‌లో సౌతాఫ్రికా వెటరన్ బ్యాటర్ క్వింటన్ డికాక్ మొదటి స్థానంలో ఉన్నాడు. 22 సంవత్సరాల 312 రోజుల వయసులో ఉన్నప్పుడు అతడు ఈ ఫీట్ నమోదు చేశాడు. భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 23 ఏళ్ల 27 రోజుల వయసులో ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఊచకోత కోశాడు
ఇక, షార్జా మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 244 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా (98) కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఆ తర్వాత ఛేజింగ్ స్టార్ట్ చేసిన ఆఫ్ఘానిస్థాన్ 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. గుర్బాజ్‌తో పాటు అజ్మతుల్లా ఒమర్జాయి (70 నాటౌట్) సూపర్బ్ నాక్ ఆడాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీయడమే గాక బ్యాటింగ్‌లోనూ విలువైన పరుగులు చేయడంతో ఒమర్జాయికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే మ్యాచ్‌లో హైలైట్ అంటే గుర్బాజ్ బ్యాటింగ్ అనే చెప్పాలి. ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఏకంగా 7 భారీ సిక్సులతో చుక్కలు చూపించాడు. సెంచరీ కొట్టడం, మ్యాచ్ గెలవడం, సచిన్-కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేయడంతో గుర్బాజ్ సంతోషంలో మునిగిపోయాడు.
Also Read:
సొంత క్రికెటర్లను పక్కన పెట్టిన ఆస్ట్రేలియా మీడియా.. కోహ్లీకి వెల్‌కమ్
కావాలనే బయటకొచ్చేశా.. నా టార్గెట్ అదే: కేఎల్ రాహుల్
వరల్డ్ క్రికెట్‌కు షాక్.. పాకిస్థాన్‌పై బ్యాన్.. చేజేతులా చేసుకున్నారు
For More Sports And Telugu News