Ranji Trophy: పోరాడుతున్న విదర్భ
ABN , Publish Date - Mar 14 , 2024 | 08:38 AM
బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై కరుణ్ నాయర్ (74), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (56 బ్యాటింగ్) అర్ధ శతకాలు నమోదు చేయడంతో.. ముంబైతో రంజీ ఫైనల్లో విదర్భ పోరాడుతోంది. 538 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా నాలుగో రోజైన బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ ఆట ముగిసేసరికి 5 వికెట్లకు 248 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో 248/5
విజయానికి 5 వికెట్ల
దూరంలో ముంబై
ముంబై: బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై కరుణ్ నాయర్ (74), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (56 బ్యాటింగ్) అర్ధ శతకాలు నమోదు చేయడంతో.. ముంబైతో రంజీ ఫైనల్లో విదర్భ పోరాడుతోంది. 538 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా నాలుగో రోజైన బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ ఆట ముగిసేసరికి 5 వికెట్లకు 248 పరుగులు చేసింది. అక్షయ్‌తోపాటు హర్ష్ దూబే (11) క్రీజులో ఉన్నాడు. ఆఖరిరోజు విజయానికి విదర్భకు 290 పరుగులు కావాల్సి ఉండగా.. ముంబై 5 వికెట్ల దూరంలో ఉంది. అథర్వ (32), అమన్ (32), ధ్రువ్ (28) ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయారు. 133/4తో ఇబ్బందుల్లో పడిన సమయంలో నాయర్, అక్షయ్ ఐదో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. అయితే, కరుణ్‌ను ముషీర్ అవుట్ చేయడంతో.. ముంబై మ్యాచ్‌పై పట్టుబిగించింది. తనుష్, ముషీర్ చెరో 2 వికెట్లు తీశారు. వికెట్ స్పిన్నర్లకు సహకరిస్తున్న తీరు చూస్తుంటే ముంబై 42వసారి రంజీ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండగా.. విదర్భ నెగ్గాలంటే అద్భుతం జరగాల్సిందే. ముంబై 224, 418 స్కోర్లు చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 105 రన్స్‌కు కుప్పకూలింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.