Share News

Ravichandran Ashwin: అశ్విన్‌ రిటైర్మెంట్‌తో తప్పించుకున్న ముగ్గురు స్టార్లు.. భలే సేఫ్ అయ్యారు

ABN , Publish Date - Dec 18 , 2024 | 02:03 PM

Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్‌లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

Ravichandran Ashwin: అశ్విన్‌ రిటైర్మెంట్‌తో తప్పించుకున్న ముగ్గురు స్టార్లు.. భలే సేఫ్ అయ్యారు
Ravichandran Ashwin

IND vs AUS: టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన స్పిన్ యోధుడు రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇన్నాళ్లూ దేశానికి ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని, గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. అయితే అశ్విన్ నిష్క్రమణతో జట్టులోని ఇతర సీనియర్ల గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి. అతడి రిటైర్మెంట్‌తో ముగ్గురు సీనియర్లు తప్పించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


వాళ్లను వదిలేశారు..

అశ్విన్ ఫెయిలైంది కేవలం రెండు మ్యాచుల్లోనే. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టుతో పాటు అడిలైడ్ టెస్ట్‌లో అతడు ప్రభావం చూపించలేకపోయాడు. అంచనాలను అందుకోలేదు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా లాంగ్ ఫార్మాట్‌లో వరుసగా విఫలమవుతున్నారు. వీళ్ల బ్యాట్ నుంచి ఆర్నెళ్లకు ఓ సెంచరీ వస్తే గొప్పే అనేలా పరిస్థితి ఉంది. అయినా జట్టును వాళ్లు వీడట్లేదు. భారీ స్కోర్లతో టీమ్‌ను గెలుపు బాటలో నడపాల్సిన విరాట్.. పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు.


బలి చేశారుగా..

మంచి ఇన్నింగ్స్‌లతో ఇతర బ్యాటర్లలో కాన్ఫిడెన్స్ నింపాల్సిన రోహిత్ స్వయంగా ఫెయిల్ అవుతున్నాడు. బ్యాట్‌తోనే గాక కెప్టెన్సీలోనూ అతడు ప్రభావం చూపించలేకపోతున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా మునుపటిలా ఆడటం లేదు. అయినా వీళ్ల ముగ్గురి మీద జట్టు వైఫల్యం ప్రభావం చూపించలేదు. కేవలం అశ్విన్‌ను బలి చేసి.. వీళ్లు తప్పించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోచ్ గంభీర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ పెద్దల సపోర్ట్ ఉండటంతో వీళ్లు సేఫ్ అయ్యారని వినిపిస్తోంది.


Also Read:

అశ్విన్‌పై కుట్ర.. పక్కా ప్లానింగ్‌తో సైడ్ చేసేశారు

రిటైర్మెంట్ ఇచ్చినా బేఫికర్.. పెన్షన్‌తో పాటు అశ్విన్‌కు ఫుల్ బెనిఫిట్స్

బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్

రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. మియా పగబడితే ఇలాగే ఉంటది

For More Sports And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 02:03 PM