Share News

RCB vs LSG: టాస్ గెలిచిన బెంగళూరు.. తుది జట్లు ఇవే!

ABN , Publish Date - Apr 02 , 2024 | 07:13 PM

లక్నోసూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లిసెస్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.

RCB vs LSG: టాస్ గెలిచిన బెంగళూరు.. తుది జట్లు ఇవే!

బెంగళూరు: లక్నోసూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (Royal Challengers Bengaluru vs Lucknow Super Giants) ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లిసెస్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో లక్నో ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. అల్జారీ జోసెఫ్ స్థానంలో టోప్లీని జట్టులోకి తీసుకుంది. ఇక లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌(KL Rahul) ఈ మ్యాచ్‌తో మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు. లక్నో కూడా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. మోహ్సీన్ ఖాన్ స్థానంలో యష్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో ఆరో స్థానంలో ఉండగా.. బెంగళూరు 9వ స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా బెంగళూరు 3, లక్నో ఒక మ్యాచ్‌లో గెలిచాయి.


తుది జట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), రీస్ టాప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 07:35 PM