Share News

RCB vs PBKS: టాస్ గెలిచిన బెంగళూరు.. తుది జట్లు ఇవే!

ABN , Publish Date - Mar 25 , 2024 | 07:08 PM

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.

RCB vs PBKS: టాస్ గెలిచిన బెంగళూరు.. తుది జట్లు ఇవే!

బెంగళూరు: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్ లో తమ తుది జట్టులో సైతం ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 31 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా పంజాబ్ 17 మ్యాచ్‌ల్లో గెలవగా.. బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు జట్ల పోటీలో పంజాబ్ అత్యధిక స్కోర్ 232 కాగా.. బెంగళూరుది 226గా ఉంది. పంజాబ్ అత్యల్ప స్కోర్ 88 కాగా.. బెంగళూరుది 84గా ఉంది.


తుది జట్లు

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

Updated Date - Mar 25 , 2024 | 07:11 PM