Rishabh Pant: పంత్‌కు రూ.50 కోట్లు.. పాత రికార్డులకు పాతర
ABN , Publish Date - Nov 04 , 2024 | 05:10 PM
Rishabh Pant: ఐపీఎల్-2025కు సంబంధించి ఇప్పటికే రిటెన్షన్ ముగిసింది. దీంతో తదుపరి జరిగే వేలం మీదే అందరి ఆసక్తి నెలకొంది. ఆక్షన్‌లో చాలా మంది స్టార్లు పాల్గొంటున్నా చిచ్చరపిడుగు రిషబ్ పంత్ మీదే అందరి ఫోకస్ ఉంది. అతడు ఈసారి వేలం రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు.
IPL Auction 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025కు సంబంధించి ఇప్పటికే రిటెన్షన్ ముగిసింది. ఫ్రాంచైజీలు గరిష్టంగా ఆరు మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నాయి. దీంతో అలా రీటెయిన్ చేసుకున్న టీమ్స్‌కు రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ఉండదు. కాబట్టి మిగిలిన టీమ్‌మేట్స్‌ను మెగా ఆక్షన్‌లో కొనుగోలు చేయనున్నాయి. వేలంలో ఎంపికైన ప్లేయర్లు వచ్చే మూడేళ్ల కాలానికి కాంట్రాక్ట్ దక్కించుకుంటారు. వేలం ఎప్పుడు? ఎక్కడ నిర్వహిస్తారనే దాని కంటే ఏయే క్రికెటర్లు ఎంతకు అమ్ముడుపోతారనే దాని మీదే అందరి ఆసక్తి నెలకొంది. కేఎల్ రాహుల్ నుంచి శ్రేయస్ అయ్యర్ వరకు చాలా మంది బడా ప్లేయర్లు వేలం బరిలో ఉన్నా చిచ్చరపిడుగు రిషబ్ పంత్ మీదే అందరి ఫోకస్ ఉంది. అతడు ఈసారి వేలం రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు.
రూ.50 కోట్లు పక్కా?
వేలంలో పంత్ కోసం అన్ని జట్లు పోటీపడేందుకు సిద్ధమవుతున్నాయి. కీపింగ్‌తో పాటు అద్భుతమైన బ్యాటింగ్‌తో రిజల్ట్‌ను తారుమారు చేసే సత్తా ఈ పించ్ హిట్టర్ కోసం కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. అతడి కోసం రూ.50 కోట్లు ఖర్చు చేసేందుకూ కొన్ని జట్లు వెనుకాడట్లేదని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. పంత్ లాంటోడు టీమ్‌లో ఢోకా ఉండదని, అందుకే అతడ్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీ ఓనర్స్ పోటీపడుతున్నారట.
సీఎస్‌కేలోకి వెళ్తాడా?
పంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌తో పాటు మరో రెండు ఫ్రాంచైజీలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. సీఎస్‌కేలోకి పంత్ రాక ఖాయమని.. ఈ మేరకు అతడితో ఎంఎస్ ధోని చర్చలు కూడా జరిపాడని సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ స్పైడీ ఎల్లో ఆర్మీతో కలిస్తే మాత్రం క్రేజీగా ఉంటుందని నెటిజన్స్ అంటున్నారు. భీకర ఫామ్‌లో ఉండటం, సింగిల్ హ్యాండ్‌తో గెలిపించే సత్తా ఉండటంతో పంత్ మీద కనకవర్షం కురవడం ఖాయమని.. ఆక్షన్‌లో కొత్త రికార్డులను అతడు క్రియేట్ చేయబోతున్నాడని నిపుణులు అంటున్నారు.
Also Read
ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవేనా..
గెలిచే మ్యాచ్‌లో పాక్ ఓటమి.. ఇంతకంటే దారుణం ఉండదు
కోచ్‌కు విషమ పరీక్ష
For More Sports And Telugu News