Share News

Cricket News: టీమిండియా క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే..

ABN , Publish Date - Dec 21 , 2024 | 01:20 PM

Cricket News: ఒక టీమిండియా క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మరి.. ఎవరా ప్లేయర్? అతడిపై ఎందుకు వారెంట్ జారీ అయింది అనేది ఇప్పుడు చూద్దాం..

Cricket News: టీమిండియా క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే..

క్రికెటర్లకు సంబంధించిన ఏ న్యూస్ ఉన్నా తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మన దేశంలో క్రికెట్ ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడో భారత ప్లేయర్ గురించే అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఓ కేసులో అతడికి అరెస్ట్ వారెంట్ జారీ అవడమే దీనికి కారణం. ఎన్నో మ్యాచుల్లో టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించిన ఆ క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అవడం సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా ప్లేయర్? ఎందుకు వారెంట్ ఇచ్చారు? అనేది ఇప్పుడు చూద్దాం..


ఎందుకీ వారెంట్?

టీమిండియా మాజీ హిట్టర్ రాబిన్ ఊతప్ప పీఎఫ్ చెల్లింపుల కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. తన సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్‌కు ప్రావిడెంట్ ఫండ్ నిధులు చెల్లించలేదని అతడి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రీసెంట్‌గా అతడిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే ఈ విషయం కొంత ఆలస్యంగా బయటకు వచ్చింది. బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఊతప్ప డైరెక్టర్‌గా ఉన్నాడు. ఇందులో వర్క్ చేసే ఉద్యోగుల నుంచి పీఎఫ్‌ను కట్ చేస్తున్నా పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదు.


అరెస్ట్ తప్పదా?

సుమారుగా రూ.23 లక్షలు ఎంప్లాయీస్ అకౌంట్‌లో జమ చేయకుండా మోసం చేశారని తేలడంతో పీఎఫ్ రీజనల్ కమిషనర్ ఊతప్పకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందజేసేందుకు డిసెంబర్ 4వ తేదీన పులకేశినగర్‌లోని మాజీ బ్యాటర్ ఇంటికి వెళ్లారు. అయితే అతడు అక్కడ లేకపోవడంతో తగిన చర్యలు తీసుకోవాలని లోకల్ పోలీసులను పీఎఫ్ రీజనల్ కమిషనర్ ఆదేశించారని సమాచారం. ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని వినిపిస్తోంది. డిసెంబర్ 27వ తేదీలోగా అతడు బకాయిలు చెల్లించకపోతే అరెస్ట్ తప్పదని వారెంట్‌లో పేర్కొన్నారు పోలీసులు. కాగా, ప్రస్తుతం ఊతప్ప తన ఫ్యామిలీతో కలసి దుబాయ్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, టీమిండియా తరఫున 59 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన ఊతప్ప.. వన్డేల్లో 54 ఇన్నింగ్స్‌ల్లో 1,183 రన్స్ చేశాడు.


Also Read:

అశ్విన్ మోసం చేశాడు.. ఇలాంటోడు అనుకోలేదు: జడేజా

జహీర్‌..ఈ బాలిక బౌలింగ్‌ చూశావా?

టైటాన్స్‌ను గెలిపించిన పవన్‌

తనకు తానే శత్రువు

For More Sports And Telugu News

Updated Date - Dec 21 , 2024 | 01:26 PM