Share News

Rohit Sharma: రోహిత్‌‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్.. వరుస వైఫల్యాలు.. అయినా..

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:29 PM

Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉంటాడు. గ్రౌండ్‌లోనే కాదు.. బయట కూడా అతడు సింపుల్‌గా, సరదాగా ఉంటాడు. అలాంటోడు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.

Rohit Sharma: రోహిత్‌‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్.. వరుస వైఫల్యాలు.. అయినా..
Rohit Sharma

టీమిండియాకు ఎంతో మంది కెప్టెన్లు వచ్చారు, పోయారు. అయితే వారిలో కపిల్‌దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి కొందరు మాత్రమే గొప్ప సారథులుగా పేరు తెచ్చుకున్నారు. వీళ్ల వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ రోహిత్ శర్మ కూడా టీమ్‌ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ను విశ్వవిజేతగా కూడా నిలబెట్టాడు. జట్టు గెలుపు తప్ప ఇంకో ఆలోచన లేకపోవడమే అతడి సక్సెస్‌కు కారణం. రికార్డులు, మైల్‌స్టోన్స్ కంటే టీమ్ విక్టరీనే ప్రధానంగా హిట్‌మ్యాన్ ముందుకు సాగుతున్నాడు. కానీ ప్రస్తుతం అతడి ధోరణి చాలా విభిన్నంగా ఉంది. అతడిలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


నో మోర్ రిటైర్మెంట్స్

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌తో ఇక భారత జట్టులో సమూలు మార్పులు జరుగుతాయని అంతా అనుకుంటున్నారు. వరుసగా ఫెయిల్ అవుతున్న రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా టెస్టులకు వీడ్కోలు చెప్పడం ఖాయమని భావిస్తున్న తరుణంలో హిట్‌మ్యాన్ బాంబు పేల్చాడు. జట్టు నుంచి మరిన్ని రిటైర్మెంట్ ప్రకటనలు ఉంటాయా? అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎదురైన ప్రశ్నకు అతడు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఇంకా ఎవరూ లేరని.. ఓన్లీ అశ్విన్ అని జవాబిచ్చాడు. తాను ఇప్పట్లో రిటైర్ అవ్వను అని ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు.


రన్స్ కంటే అదే ముఖ్యమా?

పరుగులు చేయపోయినా.. క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నానని రోహిత్ చెప్పాడు. అదే చాలా ముఖ్యమని తెలిపాడు. దీంతో ఫెయిల్ అవుతున్నా కోహ్లీని అతడు ఎందుకు బ్యాకప్ చేస్తున్నాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అదే టైమ్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్నా తనకు పరుగుల కంటే ఆటను ఎంజాయ్ చేయడం ముఖ్యమని రోహిత్ అనడం వివాదాస్పదంగా మారింది. జట్టు గెలుపు ముఖ్యంగా భావించాలని.. రన్స్ చేయకపోతే టీమ్‌లో ఉండటం దండగ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


రోహిత్ మారిపోయాడు!

రోహిత్‌లో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందని.. తనను జట్టులో నుంచి ఎవరూ తీసేయలేరనే నమ్మకంతోనే అతడు అలా మాట్లాడుతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, జట్టులో ప్రతి ఆటగాడికి స్వేచ్ఛను ఇస్తూ, ఫెయిలైనా సపోర్ట్‌గా ఉండటం రోహిత్ శైలి. అయితే వరుస వైఫల్యాలు వస్తే మాత్రం వాళ్ల ప్లేస్‌లో ఇతరులకు అవకాశాలు ఇస్తాడు. టీమ్ సక్సెస్ కోసం అవసరమైతే తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకునేందుకూ వెనుకాడడు. అలాంటోడు ఇప్పుడు జట్టును పట్టుకొని ఎందుకు వేళాడుతున్నాడు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హిట్‌మ్యాన్ టెస్టుల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. గత మూడు సిరీస్‌ల్లో అతడి బ్యాట్ నుంచి కేవలం ఒకే హాఫ్ సెంచరీ వచ్చింది. వయసు మీద పడుతోంది. జట్టు వరుస ఓటముల్లో ఉంది. అయినా హిట్‌మ్యాన్ ఇంకా టీమ్‌లో కంటిన్యూ అవడం, కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నా వెనకడుగు వేయకపోవడం మీద డిస్కషన్స్ ఊపందుకున్నాయి.

Updated Date - Dec 19 , 2024 | 12:34 PM