Share News

IND vs AUS: ఈ స్క్రాప్ అవసరమా.. తీసిపారేయండి అంటున్న నెటిజన్స్

ABN , Publish Date - Dec 08 , 2024 | 05:26 PM

Team India: భారత జట్టు మళ్లీ అభిమానుల్ని నిరాశపర్చింది. పెర్త్ టెస్ట్ గెలుపుతో విజయాల బాట పట్టిందని మురిసేలోపే అడిలైడ్‌లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో టీమ్‌లో ఈ స్క్రాప్ అవసరమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

IND vs AUS: ఈ స్క్రాప్ అవసరమా.. తీసిపారేయండి అంటున్న నెటిజన్స్

IND vs AUS: భారత జట్టు మళ్లీ అభిమానుల్ని నిరాశపర్చింది. పెర్త్ టెస్ట్ గెలుపుతో విజయాల బాట పట్టిందని మురిసేలోపే అడిలైడ్‌లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. అసలే న్యూజిలాండ్ చేతుల్లో సొంతగడ్డపై వైట్‌వాష్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్‌లో ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నెగ్గి వారిని సంతోషపెడతారని అనుకుంటే తాజా ఓటమితో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పింక్ బాల్ టెస్ట్ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. దీంతో టీమ్‌లో ఈ స్క్రాప్ అవసరమా అనే డిమాండ్లు వస్తున్నాయి. వాళ్లను తీసిపారేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఎవరా ఆటగాళ్లు అనేది ఇప్పుడు చూద్దాం..


స్టాటిస్టిక్స్ ఇదిగో..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్, సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ మీద విమర్శల జడివాన కురుస్తోంది. గత కొన్నాళ్లుగా టెస్టుల్లో వీళ్లు ఆడుతున్న తీరు మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. స్టాటిస్టిక్స్‌ను బయటకు తీస్తూ దుయ్యబడుతున్నారు. ఆ నంబర్స్ చూస్తే.. నిజంగా ఇంత చెత్తగా ఆడుతున్నారేంటని ఒప్పుకోవాల్సిందే. 6, 3, 11, 18, 8, 0, 52, 2, 8, 23, 5, 6.. లాంగ్ ఫార్మాట్‌లో గత 12 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ చేసిన స్కోర్లు ఇవి. దీంట్లో ఒకటే హాఫ్ సెంచరీ ఉంది. దీన్ని బట్టి అతడి ఫామ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


చెత్తాట కంటిన్యూ

కోహ్లీ కూడా టెస్టుల్లో దారుణంగా ఆడుతున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీని మినహాయిస్తే అతడు ఈ మధ్య కాలంలో చెత్తాటతో విమర్శల పాలవుతన్నాడు. 7, 11, 5, 4, 1, 17, 1, 0, 70, 47, 29, 6, 17.. గత మూడు సిరీస్‌ల్లో అతడి స్కోర్లు ఇవి. యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అడపాదడపా పరుగులు చేస్తున్నా కీలక మ్యాచుల్లో ఫెయిల్ అవుతున్నాడు. కన్‌సిస్టెంట్‌గా రన్స్ చేయడంలో విఫలమవుతున్నాడు. మంచి స్టార్ట్ దొరికినా భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ కూడా అందివచ్చిన అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.


నమ్మకం నిలబెట్టుకోలేక..

పెర్త్ టెస్ట్‌లో రాణించిన రాహుల్ గాడిన పడ్డాడు అనుకుంటే మళ్లీ ఫెయిల్ అయ్యాడు. చిన్న స్కోర్లను బిగ్ ఇన్నింగ్స్‌గా మలచలేకపోతున్నాడు. అతడ్ని నమ్మి రోహిత్ ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌ల్లోనూ స్లో బ్యాటింగ్‌తో విమర్శలపాలయ్యాడు. దీంతో వీళ్లందర్నీ టీమ్ నుంచి బయటకు పంపాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. వీళ్లు గ్రేట్ ప్లేయర్స్ అని.. కానీ టీమ్ ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ఈ స్క్రాప్‌ను తీసేయకపోతే భారత్ మరిన్ని దారుణ ఓటములు చవిచూడక తప్పదని హెచ్చరిస్తున్నారు. టీమ్‌లోకి కొత్త నీరు రావాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నారు.


Also Read:

ఫోన్ నంబర్‌ను తలపిస్తున్న స్కోర్ కార్డ్.. రోహిత్ ఫెయిల్యూర్‌కు బిగ్ ప్రూఫ్

అడిలైడ్‌లో ఘోర ఓటమి.. అతడి కోసం వెయిటింగ్ అంటున్న రోహిత్

కోహ్లీ ఎలాంటివాడో చెప్పిన ఫుట్‌బాల్ స్టార్.. కామెంట్స్ వైరల్

ఓటమికి వాళ్లే కారణం.. మా కొంపముంచారు: రోహిత్ శర్మ

For More Sports And Telugu News

Updated Date - Dec 08 , 2024 | 05:27 PM