Share News

Faf du Plessis: ఆర్సీబీ కెప్టెన్ ఊచకోత.. 5.4 ఓవర్లలోనే జట్టును గెలిపించిన డుప్లెసిస్

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:15 AM

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెలరేగాడు. 20 బంతుల్లోనే అజేయ హాఫ్ సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు. 5 ఫోర్లు, 3 సిక్సులతో ఏకంగా 250 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ ఊచకోత కోశాడు.

Faf du Plessis: ఆర్సీబీ కెప్టెన్ ఊచకోత.. 5.4 ఓవర్లలోనే జట్టును గెలిపించిన డుప్లెసిస్

కేప్‌టౌన్: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెలరేగాడు. 20 బంతుల్లోనే అజేయ హాఫ్ సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు. 5 ఫోర్లు, 3 సిక్సులతో ఏకంగా 250 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ ఊచకోత కోశాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్‌లో డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఎంఐ కేప్‌టౌన్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ జట్టు 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ 10 బంతుల్లోనే 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఓ ఫోర్, 4 సిక్సులున్నాయి. సూపర్ కింగ్స్ లక్ష్య చేధన సమయంలో మరోసారి వర్షం అడ్డుపడింది.


దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం జోబర్గ్ సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 98 పరుగులుగా నిర్దేశించారు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడిన సూపర్ కింగ్స్ ఓపెనర్లు డుప్లెసిస్, డు ప్లూయ్ లక్ష్యాన్ని ఊదిపడేశారు. వీరి విధ్వంసం ముందు కేప్‌టౌన్ బౌలర్లు తేలిపోయారు. దీంతో కేవలం 5.4 ఓవర్లలోనే ఒక వికెట్ కూడా కోల్పోకుండా సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని చేధించింది. ఫాఫ్ డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో సూపర్ కింగ్స్ బోనస్ పాయింట్ కూడా సాధించింది. 20 బంతుల్లోనే 50 పరుగులు చేసిన డుప్లెసిప్, 14 బంతుల్లోనే 41 పరుగులు చేసిన డు ప్లూయ్ నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌కు ముందు ఫామ్ లేమితో సతమతైన సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ ఈసారి చెలరేగాడు. డుప్లెసిస్ ఫామ్‌లోకి రావడం జట్టుకు లాభించే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సూపర్ కింగ్స్ నాలుగో స్థానానికి చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 11:15 AM