Share News

IND vs AUS: ఆసీస్‌పై నెగ్గినా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కష్టమే.. భారత్ ఆశలన్నీ మ్యాజిక్ మీదే..

ABN , Publish Date - Dec 02 , 2024 | 08:24 PM

IND vs AUS: టీమిండియా ఇప్పుడు సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్ట్‌లో ఓడించిన భారత్.. మిగిలిన మ్యాచుల్లోనూ గెలిచి డబ్ల్యూటీసీ బెర్త్‌ను ఫిక్స్ చేసుకోవాలని చూస్తోంది. కానీ సిచ్యువేషన్ మాత్రం అనుకూలంగా లేదు.

IND vs AUS: ఆసీస్‌పై నెగ్గినా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కష్టమే.. భారత్ ఆశలన్నీ మ్యాజిక్ మీదే..

WTC 2025: టీమిండియా ఇప్పుడు సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్ట్‌లో ఓడించిన భారత్.. మిగిలిన మ్యాచుల్లోనూ గెలిచి డబ్ల్యూటీసీ బెర్త్‌ను ఫిక్స్ చేసుకోవాలని చూస్తోంది. కంగారూలను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. సిరీస్‌ను గెలుచుకొని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లాలని అనుకుంటోంది. కానీ పరిస్థితులు మాత్రం భారత్‌కు అనుకూలించడం లేదు. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. ఈసారి అక్కడికి రీచ్ అవడం కష్టంగా కనిపిస్తోంది. ఒక మ్యాజిక్ మీదే ఆధారపడింది రోహిత్ సేన. అది జరిగితే తప్ప ఫైనల్ బెర్త్ దక్కేలా లేదు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


ఇలా నెగ్గితే నేరుగా ఫైనల్స్‌కు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5-0, 4-1 లేదా 3-0తో గనుక టీమిండియా గెలిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుకుంటుంది. అదే జరిగితే ఆసీస్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. పైవిధంగా గెలవకున్నా కనీసం 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకున్నా రోహిత్ సేన ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. అయితే సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్‌లో శ్రీలంక విజయం సాధించాలి. ఒకవేళ ఆ మ్యాచ్ డ్రా అయినా కూడా కంగారూలపై భారత్ 3-1తో నెగ్గితే ఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది.


ఈ మ్యాజిక్ జరగాలి

బీజీటీని 3-2తో సొంతం చేసుకున్నా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. కానీ ఆసీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక తప్పకుండా ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలి. అప్పుడే భారత్ ఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ 2-2తో డ్రా అయినా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే ఛాన్స్ ఉంటుంది. కానీ దీనికి శ్రీలంక వైపు నుంచి మ్యాజిక్ జరగాలి. ఆ టీమ్ సౌతాఫ్రికాతో సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవాలి.


Also Read:

క్రికెట్‌ను శాసించిన తోపులు.. ఒక్క దెబ్బకు గుడ్‌బై

పంత్‌ను దించేసిన పూరన్.. కిందపడినా సిక్స్ బాదేశాడు

500 కోట్లు మిస్.. చేజేతులా చేసుకున్న బుమ్రా

For More Sports And Telugu News

Updated Date - Dec 02 , 2024 | 08:28 PM