Share News

Team India: టీమిండియాను వదలని శాపం.. ఇంకెన్ని దారుణాలు చూడాలో..

ABN , Publish Date - Nov 04 , 2024 | 08:19 PM

Team India: పరువు మిగులుతుందనుకుంటే అదీ పోయింది. న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. ఆఖరి మ్యాచ్‌లో ఓడి పరాజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. అయితే తరచి చూస్తే ఈ పరాభవానికి ఓ శాపం కారణంగా కనిపిస్తోంది.

Team India: టీమిండియాను వదలని శాపం.. ఇంకెన్ని దారుణాలు చూడాలో..

సిరీస్ పోతే పోయింది కనీసం పరువైనా మిగులుతుందనుకుంటే అదీ పోయింది. న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. ఆఖరి మ్యాచ్‌లో ఓడి పరాజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. సొంతగడ్డపై వైట్‌వాష్ కావడంతో జట్టు మీద ముప్పేట దాడి జరుగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్లతో నిండిన టీమ్ ఇలా ఘోర పరాజయం పాలవడం, కనీసం ఫైట్ కూడా చేయకుండా ప్రత్యర్థికి తలొగ్గడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అసలు జట్టుకు ఏమైంది? అంటూ విస్మయానికి గురవుతున్నారు. అయితే తరచి చూస్తే ఈ పరాభవానికి ప్లేయర్ల ఫెయిల్యూర్, కోచింగ్ స్టాఫ్ వైఫల్యంతో పాటు ఓ శాపం కూడా కారణంగా కనిపిస్తోంది. ఏంటా శాపం? భారత జట్టుపై అది చూపిస్తున్న ప్రభావం ఎంత? అనేది ఇప్పుడు చూద్దాం..


అక్కడితో మొదలు..

అది 2021వ సంవత్సరం, అక్టోబర్ 24వ తేదీ. దుబాయ్ వేదికగా మెన్స్ టీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. గ్రూప్ మ్యాచ్‌లో తలపడ్డాయి భారత్-పాకిస్థాన్. దాయాదితో ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడూ టీమిండియాదే విజయం. అజేయమైన రికార్డు, ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఆ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది భారత్. కానీ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అక్కడి నుంచి మొదలైన శాపం మెన్ ఇన్ బ్లూను ఇంకా వీడటం లేదు. నవంబర్ లేదా ఆ నెలకు కాస్త ముందు జరిగే కీలక మ్యాచుల్లో భారత్ ఓడటం సాధారణంగా మారింది.


ఆడారు.. ఓడారు.. రిపీట్!

టీ20 వరల్డ్ కప్-2021లో పాక్ చేతుల్లో ఓడిన టీమిండియా.. ఆ మరుసటి ఏడాది సరిగ్గా నవంబర్ నెలలో జరిగిన మరో పొట్టి ప్రపంచ కప్‌లో మళ్లీ ఓటమిపాలైంది. ఈసారి ప్రత్యర్థి మాత్రమే మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ నాకౌట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడి ఇంటిదారి పట్టింది. నవంబర్ శాపం అక్కడితో ముగియలేదు. గత సంవత్సరం కూడా అదే రిపీట్ అయింది. పోయినేడు స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఓడి త‌ృటిలో కప్పును చేజార్చుకుంది రోహిత్ సేన. ఆ మ్యాచ్ జరిగిన తేదీ నవంబర్ 19. తాజా కివీస్ సిరీస్ ఓటమి కూడా ఇదే నెలలో జరగడం గమనార్హం.


ఇంకెన్నాళ్లీ శాపం?

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మొదట్రెండు మ్యాచులు అక్టోబర్‌లో జరిగాయి. ఆఖరి టెస్ట్ నవంబర్ నెలలో జరగ్గా.. ఇందులో కూడా ఓడి వైట్‌వాష్ అయింది భారత్. దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నా టీమ్‌ను కాపాడలేకపోయారు. నవంబర్ శాపం నుంచి జట్టును రక్షించలేకపోయారు. దీంతో ఈ శాపం ఇంకెన్నాళ్లు? అని నెటిజన్స్ వర్రీ అవుతున్నారు. ఇంకెన్ని దారుణ ఓటములు చూడాలి? ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని కోరుతున్నారు. అయితే ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఈ శాపాలు, సెంటిమెంట్లను పట్టించుకోవద్దని.. ఆ రోజు బాగా ఆడిన జట్టుదే విజయమని చెబుతున్నారు.


Also Read:

గంభీర్‌కు బీసీసీఐ గుబులు.. తప్పించుకోవడానికి నో ఛాన్స్

భార్యతో విడాకులు.. ప్రేయసితో కెమెరాకు చిక్కిన క్రికెటర్..

అయ్యర్ కావాలనే బయటకు వచ్చాడా.. పెద్ద ప్లానింగే ఇది

For More Sports And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 08:24 PM