Share News

Travis Head: నేను చెప్పిందొకటి.. సిరాజ్‌కు అర్థమైందొకటి: ట్రావిస్ హెడ్

ABN , Publish Date - Dec 07 , 2024 | 06:53 PM

Travis Head: అడిలైట్ టెస్ట్‌ రెండో రోజు ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, భారత స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Travis Head: నేను చెప్పిందొకటి.. సిరాజ్‌కు అర్థమైందొకటి: ట్రావిస్ హెడ్

IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వివాదాలు ఎక్కువైపోయాయి. గేమ్ కంటే కూడా ప్లేయర్ల మధ్య జరుగుతున్న ఫైట్స్, స్లెడ్జింగ్ లాంటివి హైలైట్ అవుతున్నాయి. పెర్త్ టెస్ట్‌ కాస్త బెటర్ అనుకుంటే.. అడిలైడ్ టెస్ట్‌లో మాత్రం కాంట్రవర్సీ డోస్ బాగా పెరిగింది. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అంటూ హీటెక్కించారు. ఆసీస్ క్యాంప్ నుంచి మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ కూడా తగ్గేదేలే అంటూ మ్యాచ్‌పై మరింత ఇంట్రెస్ట్‌ను పెంచారు. అయితే సిరాజ్-హెడ్ మధ్య జరిగిన చిన్నపాటి వార్ హైలైట్‌గా నిలిచింది.


తప్పు నాది కాదు

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఔట్ అయ్యాక క్రీజును వదిలి హెడ్ వెళ్తున్న సమయంలో వెళ్లు.. నీ పనైపోయింది అన్నట్లు సిరాజ్ ఏదో అన్నాడు. దీంతో అతడికి హెడ్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. వెళ్లు ఫస్ట్ అన్నట్లు విసుగ్గా చేతితో సిగ్నల్ ఇచ్చాడు భారత పేసర్. దీంతో అసలు వీళ్ల మధ్య ఏం జరిగింది? ఏమని తిట్టుకున్నారు? అని తెలుసుకునే పనిలో పడ్డారు ఫ్యాన్స్. దీనిపై డే2 ముగిసిన తర్వాత హెడ్ రియాక్ట్ అయ్యాడు. తాను సిరాజ్‌ను ఏమీ అనలేదని.. అతడు తనను తప్పుగా అర్థం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. తన మాట నమ్మాలన్నాడు.


గుర్తుపెట్టుకోండి

‘ఆ సమయంలో నేను చెప్పిందొకటి, సిరాజ్‌కు అర్థమైందొకటి. నువ్వు బాగా బౌలింగ్ చేశావని అతడితో అన్నా. అయితే అతడు పట్టించుకోలేదు. వెళ్లిపో అంటూ నా వైపు సీరియస్‌గా చూశాడు. దీంతో నేను కూడా కౌంటర్ ఇచ్చా. కానీ బాగా బౌలింగ్ చేశావని నేను మెచ్చుకున్నది అతడు గమనించలేదు. నేను ఒకటి చెబితే అతడికి ఇంకొకటి అర్థమైంది. ఈ విషయంలో నేను నిరాశకు లోనయ్యా. కానీ ఒకటి మాత్రం చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి.. భారత ఆటగాళ్లు ఇలాగే అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతామని అనుకుంటే అవ్వమనండి. వాళ్ల వ్యక్తిత్వం ఏంటో వాళ్లే బయటపెట్టుకుంటే మేం చేసేదేమీ లేదు’ అని హెడ్ స్పష్టం చేశాడు.


Also Read:

జైస్వాల్‌పై గిల్ సీరియస్.. వినిపించడం లేదా అంటూ..

స్టార్క్ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన గిల్.. ఇదేం బౌలింగ్ సామి

అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ.. ప్రూఫ్స్ చూపించి మరీ..

For More Sports And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 06:58 PM