Share News

Umesh Yadav: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు టీమిండియాలో దక్కని చోటు.. సీనియర్ బౌలర్ భావోద్వేగ పోస్ట్

ABN , Publish Date - Feb 11 , 2024 | 01:29 PM

ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు సెలెక్టర్లు శనివారం భారత జట్టును ప్రకటించారు. 17 మందితో కూడిన భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఒక వైపు గాయం, మరో వైపు ఫామ్ కోల్పోవడంతో శ్రేయాస్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టారు.

Umesh Yadav: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు టీమిండియాలో దక్కని చోటు.. సీనియర్ బౌలర్ భావోద్వేగ పోస్ట్

ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు సెలెక్టర్లు శనివారం భారత జట్టును ప్రకటించారు. 17 మందితో కూడిన భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఒక వైపు గాయం, మరో వైపు ఫామ్ కోల్పోవడంతో శ్రేయాస్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టారు. విరాట్ కోహ్లీ మొత్తం సిరీస్ నుంచే తప్పుకున్నాడు. గాయాలతో రెండో టెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌ను మిగతా మూడు టెస్టులకు ఎంపిక చేశారు. ఇటీవల దేశవాళీ క్రికెట్, ఇండియా ఏ తరఫున సత్తా చాటుతున్న బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే టీమిండియాలో చోటు ఆశిస్తున్న సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్‌కు మాత్రం మరోసారి నిరాశే మిగిలింది.


దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నప్పటికీ ఈ 36 ఏళ్ల సీనియర్ పేసర్‌ను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ పట్టించుకోలేదు. దీంతో నిరాశ చెందిన ఉమేష్ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా సెలెక్టర్లపై పరోక్షంగా స్పందించాడు. ఈ క్రమంలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ‘‘పుస్తకాలపై దుమ్ము పట్టినంత మాత్రాన కథ ముగిసిందని అర్థం కాదు’’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఉమేష్ యాదవ్ అదరగొట్టాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 19 వికెట్లు తీశాడు. ఉమేష్ యాదవ్ చివరగా గతేడాది జూన్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్‌లో 57 టెస్టులు ఆడిన ఉమేష్ యాదవ్ 170 వికెట్లు తీశాడు. 75 వన్డేల్లో 106, 9 టీ20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - Feb 11 , 2024 | 01:29 PM