Share News

Virat Kohli: కోహ్లీ-అనుష్క వివాహ బంధానికి 7 ఏళ్లు.. వీళ్ల బ్రేకప్ స్టోరీ తెలుసా..

ABN , Publish Date - Dec 11 , 2024 | 02:17 PM

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహ బంధానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఈ సెలబ్రిటీ కపుల్‌కు అందరూ విషెస్ తెలియజేస్తున్నారు. విరుష్క కలకాలం ఇలాగే కలసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Virat Kohli: కోహ్లీ-అనుష్క వివాహ బంధానికి 7 ఏళ్లు.. వీళ్ల బ్రేకప్ స్టోరీ తెలుసా..
Virat Kohli

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహ బంధానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. 2017, డిసెంబర్ 11వ తేదీన వీళిద్దరూ మ్యారేజ్ ద్వారా ఒక్కటయ్యారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. విరుష్క పెళ్లి తర్వాతే డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ బాగా పాపులర్ అయింది. వీళ్ల మ్యారేజ్ కాస్ట్యూమ్స్, స్టైలింగ్ కూడా అప్పట్లో క్రేజీగా మారాయి. అంతగా హల్‌చల్ చేసిన ఈ స్టార్ కపుల్.. సక్సెస్‌ఫుల్‌గా ఏడో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. దీంతో విరుష్కకు అందరూ విషెస్ తెలియజేస్తున్నారు. కోహ్లీ దంపతులు ఇలాగే కలకాలం కలసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ తరుణంలోనే కొందరు వీళ్ల లవ్‌స్టోరీని.. మరికొందరు బ్రేకప్ స్టోరీని గుర్తుచేసుకుంటున్నారు.


మంటరేపిన మూవీ..

పెళ్లికి ముందే చాన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు కోహ్లీ-అనుష్క. ఒక షాంపూ యాడ్‌ షూటింగ్‌లో వీళ్లిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి మధ్య స్నేహం పెరిగింది. అది కాస్తా ప్రేమగా టర్న్ తీసుకుంది. అప్పటి నుంచి వీరు తరచూ కలుసుకోవడం లాంటివి చేస్తూ వచ్చారు. 2014లో జరిగిన ఓ ఈవెంట్‌లో వీరు మొదటిసారి జంటగా కనిపించారు. ఆ తర్వాత కోహ్లీ ఆడే మ్యాచులకు అనుష్క రావడం స్టార్ట్ అయింది. ఓ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తయ్యాక అనుష్కకు విరాట్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో వీళ్ల ప్రేమ కథ బయటపడింది. అయితే వీళ్ల బ్రేకప్ స్టోరీ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ‘బాంబే వెల్వెట్’ అనే మూవీ కారణంగా వీళ్లు బ్రేకప్ వరకు వెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి.


కోహ్లీ కండీషన్స్

‘బాంబే వెల్వెట్’లో కోహ్లీ రూ.40 కోట్లు పెట్టుబడులు పెట్టాడని అప్పట్లో బాలీవుడ్ వర్గాలు కోడై కూశాయి. ఆ చిత్రం దారుణంగా పరాజయం పాలవడంతో విరాట్-అనుష్క బ్రేకప్ వరకు వెళ్లారని వినిపించింది. 2016లో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని కోహ్లీ పోస్ట్ చేయడంతో అది మరింత బలపడింది. అయితే కొంతకాలానికి అన్నీ సర్దుకున్నాయని టాక్ నడిచింది. కానీ నటనకు గుడ్‌బై చెబితే గానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టేది లేదని అనుష్కకు కోహ్లీ షరతు పెట్టాడని వార్తలు గుప్పుమన్నాయి. మొత్తానికి అవి కూడా సర్దుకోవడంతో ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కారని అంటుంటారు. ఏదేమైనా ఇద్దరూ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కుమార్తె వామికాతో పాటు కొడుకు అకాయ్ రాకతో సంతోషంగా ఉన్నారు. అయితే కోహ్లీ క్రికెట్‌లో కొనసాగుతున్నా.. అనుష్క యాక్టింగ్ కెరీర్‌కు దూరంగా ఉంటుండటం గమనార్హం.


Also Read:

అదేం పని.. పిచ్చి పట్టిందా.. రోహిత్‌పై భారత మాజీ క్రికెటర్ సీరియస్

రోహిత్‌కు బీసీసీఐ షాక్.. సిరీస్ మధ్యలోనే..

ఐసీసీ యాక్షన్‌కు సిరాజ్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశాడు

For More Sports And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 02:23 PM