Share News

Virat Kohli: భారత్‌ను భయపెడుతున్న కోహ్లీ.. ఫామ్ కాదు, సాలిడ్ రీజన్ ఉంది

ABN , Publish Date - Nov 20 , 2024 | 03:14 PM

Virat Kohli: పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లీ భయం పట్టుకుంది. కింగ్‌తో పాటు క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా భారత మేనేజ్‌మెంట్‌కు గుబులు పుట్టిస్తున్నాడు.

Virat Kohli: భారత్‌ను భయపెడుతున్న కోహ్లీ.. ఫామ్ కాదు, సాలిడ్ రీజన్ ఉంది

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. ప్రస్తుత క్రికెట్‌లోని టాప్-2 టీమ్స్ మధ్య భీకర పోరుకు మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. టెస్ట్ క్రికెట్‌లో యాషెస్‌ లెవల్‌ను దాటేసిన బీజీటీకి మరో రెండ్రోజుల్లో తెరలేవనుంది. దీంతో ఈ సమరానికి భారత్-ఆసీస్‌లు రెడీ అవుతున్నాయి. తమ బెస్ట్ ఎలెవన్‌తో బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లో గెలవాలని భావిస్తున్నాయి. దీటైన వ్యూహాలను సిద్ధం చేస్తూ సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని చూస్తున్నాయి. అయితే టీమిండియాను మాత్రం ఓ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అదే విరాట్ కోహ్లీ. కింగ్ ఫామ్‌లో లేడు కాబట్టి అదే ప్రాబ్లమ్ అనుకునే ప్రమాదం ఉంది. కానీ కోహ్లీ బ్యాటింగ్ గురించి కాదు.. అసలు వర్రీకి మరో రీజన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


మొదటికే మోసం

పెర్త్ టెస్ట్‌కు ముందు మెన్ ఇన్ బ్లూకు కోహ్లీ భయం పట్టుకుంది. అతడి ఇంజ్యురీ టీమ్ మేనేజ్‌మెంట్‌లో గుబులు రేపుతోంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విరాట్‌కు గాయమైందని వినిపిస్తోంది. కింగ్‌తో పాటు క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు కూడా ఇంజ్యురీ అయిందని తెలుస్తోంది. అయితే గాయం తీవ్రత పెద్దగా లేదని.. ఇప్పుడు అంతా ఓకే అని సమాచారం. కానీ దీనిపై క్రికెట్ ఎక్స్‌పర్ట్స్, మాజీ క్రికెటర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరీస్‌లోని ఒక్క మ్యాచ్ కూడా జరగకముందే ఇలా గాయాల బారిన పడితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘ సిరీస్ కాబట్టి గాయం తిరగబడితే పరిస్థితి ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. కంగారూ లాంటి టాప్ టీమ్‌తో ఆడేటప్పుడు ప్లేయర్లు ఫిట్‌గా ఉండాలని.. ఇప్పుడు ఏమీ కాలేదని కవర్ చేసి ఆడిస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.


ఫస్ట్ వికెట్ డౌన్

కోహ్లీ-రాహుల్‌ ఫుల్ ఫిట్‌గా ఉంటేనే ఆడించాలని లేదంటే రెస్ట్ ఇవ్వాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ ఫిట్‌నెస్ విషయంలో మరింత జాగ్రత్తతో ఉంటే బెటర్ అంటున్నారు. వయసు, బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకొని విరాట్‌కు విశ్రాంతిని ఇస్తే బాగుంటుందని.. లేకపోతే కెరీర్ మీద ప్రభావం పడే డేంజర్ ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, బీజీటీ మొదలవక ముందే ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌ స్టార్ట్ అవగానే ఒక వికెట్ పడిపోయింది. యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ వేలికి గాయమైంది. చీలికలు వచ్చాయని స్కానింగ్‌లో తేలింది. దీంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో కోహ్లీ, రాహుల్ గాయాలు మేనేజ్‌మెంట్‌ను మరింత కలవరానికి గురిచేస్తున్నాయి.


Also Read:

దడ పుట్టించావు కదయ్యా.. షాకిచ్చిన కోహ్లీ సోషల్ మీడియా పోస్టు

బిడ్డ పుట్టేసినా మ్యాచ్‌కు రానంటే ఎలా.. రోహిత్‌కు సీనియర్ క్రికెటర్

షఫాలీపై వేటు

For More Sports And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 03:14 PM