Share News

Kohli Konstas Fight: పిల్లాడితో ఫైటింగ్.. ఇజ్జత్ తీసుకున్న కోహ్లీ

ABN , Publish Date - Dec 26 , 2024 | 03:49 PM

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రేంజ్ వేరు. దశాబ్దంన్నర కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరుతో అతడు సంపాదించుకున్న నేమ్, ఫేమ్, క్రేజ్, పాపులారిటీ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

Kohli Konstas Fight: పిల్లాడితో ఫైటింగ్.. ఇజ్జత్ తీసుకున్న కోహ్లీ
Virat Kohli

IND vs AUS: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రేంజ్ వేరు. దశాబ్దంన్నర కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరుతో అతడు సంపాదించుకున్న నేమ్, ఫేమ్, క్రేజ్, పాపులారిటీ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. అయితే ఇంత సాధించిన ప్లేయర్.. తిరిగి కెరీర్ తొలినాళ్లను గుర్తుచేస్తున్నాడు. అప్పట్లో దూకుడైన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలిచేవాడు. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస కాంట్రవర్సీలు కారణమవుతున్నాడు విరాట్. బాక్సింగ్ డే టెస్ట్‌లో ఓ బచ్చా ప్లేయర్‌తో గొడవ పెట్టుకొని ఇజ్జత్ తీసుకున్నాడు కింగ్. అసలు ఏం జరిగింది? కోహ్లీ చేసిన తప్పు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


జూనియర్ పాంటింగ్‌తో ఫైట్

మెల్‌బోర్న్ టెస్ట్‌ తొలి రోజు కోహ్లీ-కోన్స్టాస్ ఫైట్ హాట్ టాపిక్‌గా మారింది. అరంగేట్ర టెస్ట్ ఆడుతున్న కోన్స్టాస్‌ను విరాట్ గెలికాడు. జస్‌ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లు అందర్నీ ఈ ఆసీస్ కొత్త కుర్రాడు బాదిపారేస్తున్నాడు. వరుస ఫోర్లు, సిక్సులతో హడలెత్తిస్తున్నాడు. దీంతో విరాట్ అతడ్ని రెచ్చగొట్టాడు. గ్లవ్స్ సరిచేసుకుంటున్న కోన్స్టాస్ దగ్గరకు వెళ్లి అతడ్ని ఢీకొట్టాడు కింగ్. దీంతో కంగారూ బ్యాటర్ షాక్ అయ్యాడు. అయితే ఢీకొట్టింది విరాట్ అని తెలిసినా.. అతడు వెనుకంజ వేయలేదు. కోహ్లీతో ఢీ అంటే ఢీ అంటూ స్లెడ్జింగ్‌కు దిగాడు. మ్యాచ్‌ను ఫుల్ హీటెక్కించిన ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


కోహ్లీ స్థాయికి తగునా?

కోహ్లీ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. అంత తోపు ప్లేయర్ అయి ఉండి.. చిన్న పిల్లాడితో ఫైట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ స్థాయికి ఇది తగునా? అని క్వశ్చన్ చేస్తున్నారు. బౌలర్ల పని బౌలర్లు చూసుకుంటారని.. విరాట్ పరుగులు చేయడం మీద ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. అనవసర గొడవలతో పరుగు పోగొట్టుకునే బదులు తిరిగి ఫామ్ అందుకోవడం మీద అతడు దృష్టి పెట్టాలని చురకలు అంటిస్తున్నారు. ఎంత దిగ్గజ ప్లేయరైనా సరే.. తప్పు తప్పేనని, ఈ ఘటనలో కోహ్లీ వ్యవహరించిన తీరు అస్సలు సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. బచ్చా ప్లేయర్‌ను ఢీకొట్టడం, స్లెడ్జింగ్‌కు దిగడం ఏంటని ఫైర్ అవుతున్నారు. కాగా, కోన్స్టాస్‌తో గొడవకు దిగిన కోహ్లీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడమే గాక 1 డీమెరిట్ పాయింట్ కూడా వేసింది.


Also Read:

జూనియర్ పాంటింగ్‌తో ఫైట్.. కోహ్లీకి షాక్ ఇచ్చిన ఐసీసీ

తగలరాని చోట తగిలిన బంతి.. స్మిత్ రియాక్షన్ వైరల్

సస్పెన్షన్‌ సమయంలో టోర్నీలు ఎలా ఆడింది?

మనూ భాకర్‌కు ఖేల్‌రత్న?

For More Sports And Telugu News

Updated Date - Dec 26 , 2024 | 05:26 PM