Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ.. ప్రూఫ్స్ చూపించి మరీ..
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:13 PM
Virat Kohli: అంపైర్‌తో గొడవ పెట్టుకున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కింగ్ ప్రూఫ్స్ చూపించినా అంపైర్ మాట వినకపోవడంతో ఫైట్ కాస్తా పెద్దదైంది. దీంతో కోహ్ల తగ్గేదేలే అంటూ మరింత సీరియస్ అయ్యాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆట కంటే వివాదాలు ఎక్కువవుతున్నాయి. అటు భారత ఆటగాళ్లు, ఇటు ఆస్ట్రేలియా ప్లేయర్లు తగ్గేదేలే అంటుండటంతో గ్రౌండ్‌లో వాతావరణం హీటెక్కుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు మధ్యలో అంపైర్లు నిప్పు రాజేస్తూ సిరీస్‌ను మరింత కాంట్రవర్షియల్‌గా మారుస్తున్నారు. ముఖ్యంగా అడిలైడ్ టెస్ట్ అయితే సెషన్, సెషన్‌కు గరం గరంగా మారుతోంది. అందునా విరాట్ కోహ్లీ యాక్షన్‌లోకి దిగిన ప్రతిసారి ఏదో ఒక రచ్చ జరుగుతోంది. పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు అంపైర్లతో గొడవకు దిగాడు విరాట్. అసలు కోహ్లీ ఎందుకు ఫైట్ చేశాడు? అంపైర్ చేసిన తప్పేంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
చెత్త అంపైరింగ్
అడిలైడ్ టెస్ట్ రెండో రోజు ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ ఔట్ విషయంలో గందరగోళం తలెత్తింది. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేయబోయి మిస్ అయ్యాడు మార్ష్. అతడి బ్యాట్‌ను ఛేదించుకొని వచ్చిన బంతి నేరుగా ప్యాడ్స్‌కు తగలడంతో టీమిండియా ప్లేయర్లు అప్పీల్ చేశారు. అయితే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. పక్కా ఔట్ అని నమ్మకం ఉండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్ఎస్ తీసుకున్నాడు. అయితే అక్కడ కూడా మెన్ ఇన్ బ్లూకు వ్యతిరేకంగా నిర్ణయం వచ్చింది. బంతి ప్యాడ్స్‌కు తగిలాక బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా కన్‌క్లూజివ్ ఎవిడెన్స్ లేదనే సాకుతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ఇచ్చాడు.
ఔటైనా వదిలేశారు
ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇస్తున్నట్లు థర్డ్ అంపైర్ ప్రకటించాడు. దీంతో భారత ఆటగాళ్లు నిరాశలో కూరుకుపోయారు. బౌలర్ అశ్విన్, సారథి రోహిత్ ఏంటిది అంటూ షాక్ అయ్యారు. కోహ్లీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అంపైర్‌తో గొడవకు దిగాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ నాటౌట్ అయినా ఔట్ ఇచ్చారని.. ఇప్పుడు క్లియర్ ఔట్ అయినా నాటౌట్ ఇవ్వడం ఏంటని సీరియస్ అయ్యాడు. రాహుల్ ఉదంతాన్ని ఆధారంగా చూపించి ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో అంపైర్లు భారత్‌కు శాపంగా మారారని.. భారత్‌ను ఓడించాలనే ఆసీస్ కుట్రలో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read:
ఆస్ట్రేలియాకు కోహ్లీ వార్నింగ్.. రా చూస్కుందామంటూ..
సెంచరీ తర్వాత హెడ్ విచిత్రమైన సెలబ్రేషన్.. ఎందుకిలా చేశాడంటే..
బుద్ధి చూపించిన ఆస్ట్రేలియా.. చీటింగ్ రిపీట్
ఆసీస్ బ్యాటర్లను ఆడుకున్న కోహ్లీ.. ఇదీ స్లెడ్జింగ్ అంటే..
For More Sports And Telugu News