Share News

Virat Kohli: బర్త్‌డే స్పెషల్.. కోహ్లీ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:38 PM

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనామక ఆటగాడి స్థాయి నుంచి వరల్డ్ క్రికెట్‌ను శాసించే రారాజుగా ఎదగడం వరకు సాగిన అతడి ప్రయాణం ఎందరికీ స్ఫూర్తిదాయకం. అయితే కింగ్ లైఫ్ తెరిచిన పుస్తకమేమీ కాదు. అందులో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి.

Virat Kohli: బర్త్‌డే స్పెషల్.. కోహ్లీ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనామక ఆటగాడి స్థాయి నుంచి వరల్డ్ క్రికెట్‌ను శాసించే రారాజుగా ఎదగడం వరకు సాగిన అతడి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. రికార్డుల మీద రికార్డుల బద్దలుకొడుతూ గ్రేటెస్ట్ క్రికెటర్ రేంజ్‌కు చేరుకున్నాడు. అయితే కింగ్ లైఫ్ తెరిచిన పుస్తకమేమీ కాదు. అందులో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఇవాళ 36వ పడిలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ బ్యాటర్ జీవితంలోని పలు సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


హీరోయిన్లతో అఫైర్లు

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్న అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడాడు కోహ్లీ. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కోహ్లీ లైఫ్‌లో పలు అఫైర్లు కూడా ఉన్నాయని అంటుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నాతో కోహ్లీ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని అప్పట్లో రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఒక యాడ్ షూట్‌లో కలసిన ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమ వరకు వెళ్లిందని గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. తమన్నాతోనే కాదు బ్రెజిల్ నటి, మోడల్ ఇజబెల్లేతోనూ అతడు ప్రేమాయాణం సాగించనట్లు వార్తలు వచ్చాయి. అయితే అనుష్కతో లవ్, మ్యారేజ్‌తో ఈ రూమర్స్ గురించి అందరూ మర్చిపోయారు.


జర్నలిస్ట్‌తో జగడం

కోహ్లీ అగ్రెషన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాస్త కూల్‌గా ఉంటున్నాడు గానీ కెరీర్ తొలినాళ్లలో విరాట్ కరెంట్ వైర్‌లా ఉండేవాడు. అతడ్ని ముట్టుకుంటే షాక్ కొట్టాల్సిందే. అతడితో పెట్టుకుంటే ప్రత్యర్థులకు మూడినట్లే పరిస్థితులు ఉండేవి. అపోజిషన్ ప్లేయర్లతోనే కాదు.. ఒకసారి ఏకంగా జర్నలిస్ట్‌తోనే జగడం పెట్టుకున్నాడు కింగ్. వన్డే వరల్డ్ కప్-2015 సమయంలో ప్రాక్టీస్ సెషన్ కవర్ చేసేందుకు వచ్చిన ఓ జర్నలిస్ట్ మీద అతడు సీరియస్ అయ్యాడు. గతంలో అనుష్క శర్మ పై అతడు ఓ ఆర్టికల్ రాయడంతో అది మనసులో పెట్టుకున్న కింగ్.. అతడ్ని తిట్టాడు. అయితే తర్వాత కోహ్లీ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.


ఫేక్ పేర్లు

కోహ్లీ-అనుష్క 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల మధ్య ఇటలీలో వీళ్ల మ్యారేజ్ జరిగింది. కేవలం 42 మంది మాత్రమే వివాహ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈవెంట్‌కు ప్రైవసీ ఉండాలనే ఉద్దేశంతో క్యాటరింగ్‌తో పాటు ఇతర బుకింగ్స్‌కు కొన్ని ఫేక్ పేర్లు వాడారు. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క శర్మ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేయడం గమనార్హం.


కుంబ్లేతో కయ్యం

కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో జట్టుకు హెడ్ కోచ్‌గా వచ్చాడు లెజెండ్ అనిల్ కుంబ్లే. అయితే క్రమశిక్షణకు మారుపేరైన కుంబ్లే ప్రతి విషయంలో నిక్కచ్చిగా ఉండేవాడు. అలాగే చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడు. కుంబ్లేతో కోహ్లీకి పొసగకపోవడంతో అతడు కోచ్‌ను మార్చాలని పట్టుబట్టడం, రవిశాస్త్రిని ఆ పోస్ట్‌లోకి తీసుకోవడం తక్కువ టైమ్ లో జరిగిపోయాయి. విరాట్ వల్లే కుంబ్లేను తొలగించారని, కోహ్లీ ఏం చెబితే అది చేస్తారా అంటూ అప్పట్లో మాజీ క్రికెటర్లు విమర్శలకు దిగారు. అయితే కోహ్లీ-రవిశాస్త్రి కాంబోలో వరుస విజయాలు రావడంతో క్రమంగా ఆ వివాదం మరుగున పడింది.


ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్

ఏళ్లుగా టాప్ ప్లేయర్‌గా కొనసాగుతున్న కోహ్లీ కోసం అడ్వర్టయిజ్‌మెంట్ కంపెనీలు ఎగబడతాయి. అయితే అతడు మాత్రం ఏది పడితే ఆ యాడ్ చేయడు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్‌లు లేదా మనీ రిస్క్ ఉండే ప్రమోషన్స్‌కు చాలా దూరంగా ఉంటాడు. కానీ అలాంటోడు ‘ఎంపీఎల్’ అనే ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఎండార్స్ చేశాడు. దీంతో అతడిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. డబ్బుల కోసం ఏదైనా చేస్తావా? అంటూ నెట్టింట అతడిపై ట్రోలింగ్ నడిచింది.


Also Read

మ్యాచ్ జరుగుతుండగా పడిన పిడుగు.. ఆటగాడి పరిస్థితి ఏంటంటే..

మూలాలు మరిస్తే ఎలా..!.

ఆ ఇద్దరిని తీసుకోండి

For More Sports And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 06:26 PM