Virat Kohli: కోహ్లీని అవమానించిన ఆసీస్.. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా..
ABN , Publish Date - Dec 27 , 2024 | 07:38 PM
Boxing Day Test: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అక్కసు తీర్చుకుంది ఆస్ట్రేలియా. కింగ్‌ను అవమానించింది. అంత తోపు బ్యాట్స్‌మన్ అని కూడా చూడకుండా ఇన్‌సల్ట్ చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
IND vs AUS: క్రికెట్‌లో తామే తోపులు, తమ కంటే ఎవరూ గొప్ప కాదు అనేలా ఆస్ట్రేలియా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ టీమ్ ప్లేయర్లు పొగరుతో బిహేవ్ చేయడం , ఇతర జట్ల ఆటగాళ్లను స్లెడ్జింగ్‌తో భయపెట్టిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కంగారూ ఫ్యాన్స్ కూడా తక్కువేమీ కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లను దూషించడం, అవమానించడం, హేళన చేయడంలో వాళ్లు ముందంజలో ఉంటారు. ఎంత బడా ప్లేయర్లు అనేది కూడా చూడకుండా ఎగతాళి చేయడం, హేళన చేయడం వారికి పరిపాటిగా మారింది. అందుకే ఆస్ట్రేలియాలో మ్యాచులు ఆడాలంటే అపోజిషన్ టీమ్స్ భయపడతాయి. తాజాగా దీన్ని భారత క్రికెటర్లు కూడా రుచిచూశారు. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అవమానం ఎదురైంది.
హేళన తట్టుకోలేక..
కోహ్లీని అవమానించింది ఆసీస్. ఆ జట్టు ఫ్యాన్స్ కింగ్‌ను టార్గెట్ చేసుకొని బూ.. అంటూ హేళన చేశారు. దీంతో కింగ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. ఏమన్నారంటూ వాళ్ల వైపు సీరియస్‌గా చూశాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న కోహ్లీ తిరిగి ఆడియెన్స్ దగ్గరకు వచ్చాడు. ఏం అనుకుంటున్నారు అంటూ కంగారూ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యాడు. అయితే వెంటనే దగ్గర్లో ఉన్న సెక్యూరిటీ మేనేజర్ అక్కడికి వచ్చి కోహ్లీని కూల్ చేశాడు. వాళ్లను పట్టించుకోవద్దంటూ అతడ్ని డ్రెస్సింగ్ రూమ్‌కు పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఒక్కడి మీదే టార్గెట్
కోహ్లీతో పాటు సిరాజ్, జైస్వాల్ లాంటి ఇతర భారత ఆటగాళ్లను కూడా ఆసీస్ ఫ్యాన్స్ ఇబ్బంది పెడుతున్నారు. అయితే సిరీస్ మొదట్నుంచి వాళ్ల ఫోకస్ ఎక్కువగా విరాట్ మీదే ఉంది. టీమ్‌లోని కీలక ఆటగాడు కావడంతో కింగ్‌ను టార్గెట్ చేసుకొని బూ.. అంటూ అవమానిస్తున్నారు కంగారూ అభిమానులు. బాక్సింగ్ డే టెస్ట్‌లోనూ అదే రిపీట్ చేశారు. అయితే వాళ్లకు ఎప్పటికప్పుడు గట్టి కౌంటర్లు ఇస్తూ వస్తున్నాడు కోహ్లీ. ఇవాళ కూడా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తున్న వాడు తిరిగొచ్చి మరీ వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. కింగ్‌కు భారత అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. తగ్గేదేలే.. కంగారూలకు ఇచ్చిపడేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి దిగ్గజ ప్లేయర్‌ను అవమానిస్తే, దూషిస్తే ఎలా ఊరుకుంటారని.. పరుగుల వర్షం కురిపించి వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని సూచిస్తున్నారు.
Also Read:
కోహ్లీని కాపాడిన సచిన్ టెక్నిక్.. 20 ఏళ్ల సీన్ రిపీట్
మాట తప్పిన రోహిత్.. కెప్టెన్ అని నమ్మితే నిండా ముంచాడు..
పంతం నెగ్గించుకున్న ఆసీస్.. 11 మంది కలసి మరీ..
వాటే షాట్ కోహ్లీ.. కడుపు నిండిపోయింది బంగారం
For More Sports And Telugu News