RCB vs PBKS: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. దిగ్గజ ప్లేయర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ABN , Publish Date - Mar 25 , 2024 | 09:41 PM
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ అందుకున్నాడు.
బెంగళూరు: ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ అందుకున్నాడు. తద్వారా అన్ని రకాల టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో 172 క్యాచ్‌లు పట్టిన టీమిండియా మాజీ ఆటగాడు, దిగ్గజ ఫీల్డర్ సురేష్ రైనా ఆల్ టైమ్ రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. ప్రస్తుతం 173 క్యాచ్‌లతో కింగ్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు.
167 క్యాచ్‌లు పట్టిన రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 146 క్యాచ్‌లు పట్టిన మనీష్ పాండే, 136 క్యాచ్‌లు పట్టిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు 177 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ శిఖర్ ధావన్(45) మినహా మిగతా బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినప్పటికీ విలువైన పరుగులు చేశారు. దీంతో పంజాబ్ జట్టు మంచి స్కోర్ సాధించింది. ఆ జట్టు బ్యాటర్లు జితేష్ శర్మ(27), ప్రభుసిమ్రాన్ సింగ్(25), సామ్ కర్రాన్(23), శశాంక్ సింగ్(21) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్(2/26), గ్లెయిన్ మాక్స్‌వెల్ (2/29), యష్ దయాల్ (1/23) కట్టడి చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.