Virat Kohli: కోహ్లీని కాపాడిన సచిన్ టెక్నిక్.. 20 ఏళ్ల సీన్ రిపీట్
ABN , Publish Date - Dec 27 , 2024 | 05:43 PM
Boxing Day Test: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బలహీనతను అధిగమించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాయంతో సమస్య నుంచి బయటపడ్డాడు. 20 ఏళ్ల క్లాసికల్ టెక్నిక్‌ను రిపీట్ చేశాడు.
IND vs AUS: దశాబ్దంన్నర కాలంగా టీమిండియాకు ఆడుతూ కోట్లాది మందికి ఆరాధ్య క్రికెటర్‌గా మారాడు విరాట్ కోహ్లీ. సూపర్బ్ బ్యాటింగ్‌తో మోడర్న్ డే గ్రేట్‌గా పేరు తెచ్చుకున్నాడు. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతూ నంబర్ వన్ ప్లేయర్‌గా గుర్తింపు సంపాదించాడు. అయితే ప్రతి ఆటగాడికి ఓ వీక్‌నెస్ ఉన్నట్లే.. కింగ్‌కూ ఒక బలహీనత ఉంది. అదే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్. ఆఫ్ వికెట్‌కు దూరంగా పడిన బంతిని వెంటాడి ఔట్ అవడం కోహ్లీకి అలవాటుగా మారింది. ఆ లెంగ్త్‌లో పడిన బంతుల్ని కవర్ డ్రైవ్, కట్ షాట్స్‌తో అతడు ఎన్నోమార్లు బౌండరీలకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. మళ్లీ అలాగే ఆడదామని ప్రయత్నించి ఈ మధ్య పదే పదే వికెట్ పారేసుకుంటున్నాడు. అయితే ఎట్టకేలకు దీని నుంచి బయటపడ్డాడు.
సచిన్ స్ఫూర్తిగా..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెక్నిక్‌ను వాడి తన బలహీనత నుంచి బయటపడ్డాడు కోహ్లీ. 20 ఏళ్ల కింద ఇదే టైమ్‌లో సచిన్ కూడా ఆఫ్ స్టంప్‌కు అవతల పడిన డెలివరీస్‌ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇదే వీక్‌నెస్‌తో ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయితే పట్టుదలతో ఆడుతూ దీని నుంచి బయటపడ్డాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా 2004లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ స్టంప్ డెలివరీస్‌ను వదిలిపెట్టి ఆడాడు. తన ఫేవరెట్ షాట్ అయిన కవర్ డ్రైవ్‌ను ఒక్కసారి కూడా ఆడలేదు. మొత్తం ఇన్నింగ్స్‌లో స్ట్రయిట్ డ్రైవ్‌లు, ఫ్లిక్స్, కట్ షాట్స్, స్వీప్స్, పుల్ షాట్స్ ఆడాడు. అలా ఏకంగా 241 పరుగులు బాదేశాడు.
ఇదే జోరు కొనసాగనీ..
బాక్సింగ్ డే టెస్ట్‌లో సచిన్‌ను కాపీ చేశాడు కోహ్లీ. ఆసీస్ బౌలర్లు ఎంతగా ఊరిస్తున్నా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీస్‌ను అతడు వదిలేశాడు. కేవలం ఒకే కవర్ డ్రైవ్ ఆడాడు. అది కూడా పూర్తిగా అతడి జోన్‌లో పడిందని కన్ఫర్మ్ అయ్యాకే కొట్టాడు. ఓవరాల్‌గా మెల్‌బోర్న్ టెస్ట్‌లో 86 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 36 పరుగులు చేశాడు. అతడు చేసింది తక్కువ స్కోరే అయినా.. ఆఫ్ స్టంప్ వీక్‌నెస్‌ను దాదాపుగా అధిగమించడం, పట్టుదలతో ఆడటం, జైస్వాల్‌తో కలసి మూడో వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించడం హైలైట్‌గా నిలిచాయి. సచిన్ టెక్నిక్‌ను ఫాలో అవడం కింగ్‌కు కలిసొచ్చింది. ఇదే జోరును కంటిన్యూ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్‌లో అతడి బ్యాట్ నుంచి బిగ్ నాక్ రావడం పక్కాగా కనిపిస్తోంది.
Also Read:
మాట తప్పిన రోహిత్.. కెప్టెన్ అని నమ్మితే నిండా ముంచాడు..
పంతం నెగ్గించుకున్న ఆసీస్.. 11 మంది కలసి మరీ..
వాటే షాట్ కోహ్లీ.. కడుపు నిండిపోయింది బంగారం
టీమిండియా కొంపముంచిన జైస్వాల్.. ఆసీస్ నెత్తిన పాలు
For More Sports And Telugu News