Share News

IND vs ENG: ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్ గెలిచిన టీమిండియాపై కోహ్లీ కామెంట్స్ ఇవే!

ABN , Publish Date - Feb 26 , 2024 | 07:48 PM

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో మన కుర్రాళ్లు అదరగొట్టారు. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకపోయినప్పటికీ అద్భుతంగా ఆడి జట్టుకు సీరీస్ విజయాన్ని అందించారు.

IND vs ENG: ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్ గెలిచిన టీమిండియాపై కోహ్లీ కామెంట్స్ ఇవే!

రాంచీ: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో మన కుర్రాళ్లు అదరగొట్టారు. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకపోయినప్పటికీ అద్భుతంగా ఆడి జట్టుకు సీరీస్ విజయాన్ని అందించారు. ముఖ్యంగా యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురేల్ అద్భుతంగా ఆడారు. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయంలో కుర్రాళ్లేదే కీలకపాత్ర. ఈ విజయంతో మరో టెస్ట్ మిగిలి ఉండగానే 3-1తో భారత జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. టీమిండియా విజయంపై సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. యువ ఆటగాళ్లపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ‘‘అవును. మన యువ జట్టు అద్భుతమైన సిరీస్ విజయం సాధించింది. మన కుర్రాళ్లు పట్టుదల, సంకల్పం, కఠిన పరిస్థితులు ఎదుర్కొని ధృఢత్వాన్ని ప్రదర్శించారు.’’ అని పేర్కొన్నాడు.


కాగా స్వదేశంలో భారత జట్టు వరుసగా 17వ టెస్ట్ సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 192 పరుగుల లక్ష్య చేధనలో భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ శుభారంభాన్ని అందించారు. ఓపెనర్లిద్దరూ తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించారు. కెప్టెన్ రోహిత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 120 పరుగులకే సగం వికెట్లు నేలకూలాయి. ఇలాంటి సమయంలో అద్భుతంగా ఆడిన శుభ్‌మన్ గిల్, ధృవ్ జురేల్ 72 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. 52 పరుగులు చేసిన గిల్, 39 పరుగులు చేసిన ధృవ్ నాటౌట్‌గా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన ధృవ్ జురేల్ 90 పరుగులతో చెలరేగాడు. దీంతో ధృవ్ జురేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353, భారత్ 307.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 145, భారత్ 192 పరుగులు చేశాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 07:48 PM