Share News

IPL 2024: అది నా కల.. ట్రోఫిలు రెండయితే బాగుంటుంది: విరాట్ కోహ్లీ

ABN , Publish Date - Mar 20 , 2024 | 10:54 AM

టైటిల్ గెలవాలనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 ఏళ్ల నిరీక్షణకు వారి ఉమెన్స్ టీం తెరదించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది.

IPL 2024: అది నా కల.. ట్రోఫిలు రెండయితే బాగుంటుంది: విరాట్ కోహ్లీ

టైటిల్ గెలవాలనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 ఏళ్ల నిరీక్షణకు వారి ఉమెన్స్ టీం తెరదించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది. ఈ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం ఏర్పాటుచేసిన అన్‌బాక్స్ ఈవెంట్‌లో ఆర్సీబీ ఉమెన్స్ టీంను గార్డ్ ఆఫ్ అనర్‌తో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీబీ నూతన జెర్సీని కూడా ఆవిష్కరించారు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఉమెన్స్ జట్టును అభినందించాడు. ఐపీఎల్ 2024 ట్రోఫిని గెలిచి ఈ సారి టైటిళ్ల సంఖ్చను రెట్టింపు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. అలాగే ఐపీఎల్ ట్రోఫి గెలిస్తే ఎలా ఉంటుందో అనేది తన కల అని పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


‘‘ట్రోఫిలను రెట్టింపు చేయగలమని నేను ఆశిస్తున్నాను. అది నిజంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఐపీఎల్ ట్రోఫి గెలిస్తే ఎలా ఉంటుందో అన్నది నా కల. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. మొదటిసారి ట్రోఫి గెలిచే జట్టులో భాగమవుతా. నా సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించి అభిమానులు, ఫ్రాంచైజీ కోసం కప్ గెలవడానికి ప్రయత్నిస్తా’’ అని కోహ్లీ చెప్పాడు. కాగా ఐపీఎల్‌లో బలమైన జట్లలో ఒక్కటిగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒకసారి కూడా ట్రోపీ గెలవలేకపోయింది. దీంతో 16 సీజన్లుగా ట్రోఫీ కోసం నిరీక్షణ తప్పడం లేదు. మూడు సార్లు ఫైనల్ కూడా చేరినప్పటికీ తుది మెట్టుపై బోల్తాపడింది. దీంతో ఐపీఎల్ టైటిల్ అనేది ఆర్సీబీకి అందని ద్రాక్షగానే మారిపోయింది. ఇలాంటి సమయంలో ఆర్సీబీ ఉమెన్స్ జట్టు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవడం శుభ పరిణామం. ఇది అభిమానుల్లో ఉత్సాహం నింపింది. అదే ఊపులో ఐపీఎల్ టైటిల్ కూడా గెలవాలని ఆర్సీబీ భావిస్తోంది. ఇక ఐపీఎల్ 2024 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 10:54 AM