Share News

Virat Kohli: ఫ్యాన్స్‌పై కోహ్లీ సీరియస్.. ఇకనైనా ఆపండి అంటూ..

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:49 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాటి ప్లేయర్లతో పాటు అభిమానులతోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. తన సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్స్‌లోనూ అండగా నిలబడే ఫ్యాన్స్‌ అంటే కింగ్‌కు ఎంతో ఇష్టం.

Virat Kohli: ఫ్యాన్స్‌పై కోహ్లీ సీరియస్.. ఇకనైనా ఆపండి అంటూ..

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాటి ప్లేయర్లతో పాటు అభిమానులతోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. తన సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్స్‌లోనూ అండగా నిలబడే ఫ్యాన్స్‌ అంటే కింగ్‌కు వల్లమాలిన అభిమానం. భారత మ్యాచులు జరిగే సమయంలో అభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు స్టేడియంలో డ్యాన్సులు చేస్తుంటాడు కోహ్లీ. కొన్నిసార్లు పాటలు కూడా పాడుతూ వారిలో జోష్ నింపుతాడు. అవకాశం దొరికితే అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం, సెల్ఫీలు దిగడం లాంటివి చేస్తుంటాడు. అలాంటోడు ఎన్నడూ లేనిది ఫ్యాన్స్ మీద సీరియస్ అయ్యాడు. ఇకనైనా ఆపండ్రా అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


ఎగబడిన ఫ్యాన్స్

న్యూజిలాండ్ సిరీస్ ముగించుకున్న కోహ్లీ.. ఆస్ట్రేలియా టూర్‌కు బయల్దేరాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసీస్‌కు పయనమయ్యాడు కింగ్. సతీమణి అనుష్క శర్మతో పాటు ఇద్దరు పిల్లలతో కలసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చాడు విరాట్. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లాడు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఎప్పటిలాగే అతడి ఆటోగ్రాఫ్‌, సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. వాళ్లను నిరుత్సాహపర్చొద్దనే ఉద్దేశంతో ఫ్యామిలీ నుంచి కాస్త దూరంగా వచ్చి మరీ ఓపికగా ఫొటోలు దిగాడు కోహ్లీ. కానీ ఒకరి తర్వాత ఒకరుగా చాలా మంది అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడటంతో అతడు అసహనానికి లోనయ్యాడు.


ఇకనైనా వదిలేయండ్రా

ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లాలని కోహ్లీ అంటున్నా కొందరు ఫ్యాన్స్ పట్టించుకోలేదు. అభిమానులతో పాటు కెమెరామెన్స్ కూడా అతడితో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో కోహ్లీ సీరియస్ అయ్యాడు. ఇకనైనా ఆపండ్రా బాబు అంటూ చిరాకు పడ్డాడు. ఫ్యామిలీని వదిలేసి మరీ ఫొటోల కోసం వచ్చానని.. వదిలేయండ్రా అంటూ అసహనం వ్యక్తం చేశాడు. లోపలకు వెళ్లేందుకు తనకు సహకరించాలని రిక్వెస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. సెలెబ్రిటీలతో సెల్ఫీలు దిగాలనుకోవడం కరెక్టే అని, కానీ వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదని అంటున్నారు.


Also Read:

టీ20 క్రికెట్‌లో ఎవరూ సాధించని రికార్డు సాల్ట్ సొంతం

టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఒకటి అనుకుంటే..

ఛాంపియన్స్ ట్రోఫీపై తేల్చేసిన ఐసీసీ

For More Sports And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 01:53 PM