Share News

Virat Kohli: కోహ్లీ రిటైర్ అయ్యేది ఆ రోజే.. తేల్చేసిన కోచ్

ABN , Publish Date - Dec 19 , 2024 | 01:12 PM

Virat Kohli: వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడు. దీంతో భారత జట్టులో మిగతా సీనియర్ల రిటైర్మెంట్ గురించి చర్చలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో కోహ్లీ కెరీర్‌పై కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Virat Kohli: కోహ్లీ రిటైర్ అయ్యేది ఆ రోజే.. తేల్చేసిన కోచ్
Virat Kohli

భారత క్రికెట్‌కు సంబంధించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించే మొన్నటి వరకు డిస్కషన్స్ ఉండేవి. టీమిండియా గెలిచిందా? ఓడిందా? ఎవరెలా ఆడారు? అనే చర్చలే నడిచేవి. కానీ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు అల్విదా చెప్పేయడంతో ఇప్పుడు టీమిండియా ఫ్యూచర్ గురించి డిస్కషన్స్ ఊపందుకున్నాయి. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలో నెక్స్ట్ ఎవరు రిటైర్మెంట్ ఇస్తారు? వాళ్లను ఎవరు రీప్లేస్ చేస్తారు? అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే కోచ్ మాత్రం కోహ్లీ ఇప్పట్లో రిటైర్ అవ్వడని అంటున్నాడు.


వరల్డ్ కప్‌ ఆడతాడు!

కోహ్లీ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాల మీద అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ రియాక్ట్ అయ్యాడు. విరాట్ ఇప్పట్లో రిటైర్ అవ్వడని.. వన్డే ప్రపంచ కప్-2027 వరకు అతడు ఆడతాడని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాతే రిటైర్ అవుతాడని అన్నాడు. ఓవరాల్‌గా మరో 5 ఏళ్ల పాటు పక్కా అతడు క్రికెట్‌లో కొనసాగుతాడని స్పష్టం చేశాడు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో విరాట్ వరుసగా విఫలమవుతున్నాడు. బీజీటీలోనూ అదే కంటిన్యూ అవుతోంది. పెర్త్ టెస్ట్‌లో సెంచరీ బాదిన తర్వాతి మ్యాచ్‌లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ విషయం మీదా కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించాడు. కోహ్లీ సరిగ్గా ఆడట్లేదని అనడం కరెక్ట్ కాదన్నాడు.


ఎంత మంది సెంచరీలు కొట్టారు?

‘2008లో భారత జట్టులోకి అడుగు పెట్టినప్పటి నుంచి కోహ్లీ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ వస్తున్నాడు. అలాంటోడ్ని సరిగ్గా ఆడటం లేదని అనడం సరికాదు. కేవలం రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ అయినంత మాత్రాన అలా అంటారా? ఆసీస్‌తో ప్రస్తుత సిరీస్‌లో అతడు ఆల్రెడీ ఒక సెంచరీ బాదాడు. ఈ సిరీస్‌లో ఎంత మంది ఆటగాళ్లు సెంచరీలు కొట్టారో చెప్పండి?’ అని కోహ్లీ కోచ్ ఎదురు ప్రశ్నించాడు. విరాట్‌తో తరచూ మాట్లాడుతుంటానని తెలిపాడు. తన ఆటలో లోపాలు, ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయనేది కోహ్లీ ఈజీగా పసిగట్టి మార్చుకుంటాడని పేర్కొన్నాడు.


Also Read:

రోహిత్‌‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్.. వరుస వైఫల్యాలు.. అయినా..

నెక్స్ట్ ఎవరు.. రిటైర్మెంట్‌పై ప్రశ్న.. రోహిత్ దిమ్మతిరిగే ఆన్సర్

అశ్విన్‌కు కమిన్స్ స్పెషల్ గిఫ్ట్.. మనసులు గెలిచిన ఆసీస్ కెప్టెన్

For More Sports And Telugu News

Updated Date - Dec 19 , 2024 | 01:17 PM