Virender Sehwag: సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ.. వామ్మో.. తండ్రిని మించిన విధ్వంసం
ABN , Publish Date - Nov 21 , 2024 | 10:01 PM
Virender Sehwag: భారత క్రికెట్‌లో ఊచకోత అనే పదం ఎవరికైనా సెట్ అవుతుందంటే అది వీరేంద్ర సెహ్వాగ్‌కే. ఈ మాజీ ఓపెనర్ విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాడు. అతడి పేరు వింటేనే ప్రత్యర్థి బౌలర్లు జడుసుకునేవారు.
Aaryavir: భారత క్రికెట్‌లో ఊచకోత అనే పదం ఎవరికైనా సెట్ అవుతుందంటే అది ఒక్క వీరేంద్ర సెహ్వాగ్‌కే అని చెప్పాలి. ఈ మాజీ ఓపెనర్ విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాడు. అతడి పేరు వింటేనే ప్రత్యర్థి బౌలర్లు జడుసుకునేవారు. ఫోర్లు, సిక్సులతో తమ మీద పిడుగులా పడతాడని భయపడేవారు. అతడికి బౌలింగ్ వేయాలంటే తోపు బౌలర్లు కూడా వణికేవారు. వీరూ క్రీజులో ఉన్నంత సేపు స్కోరు బోర్డు రాకెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టేది. సెహ్వాగ్‌లా మూడు ఫార్మాట్లలో అంత డామినేట్ చేసిన బ్యాటర్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే రిటైరైనా సెహ్వాగ్ గురించి అభిమానులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. వీరూ వారసత్వాన్ని కొనసాగిస్తూ అతడి కొడుకు వచ్చేశాడు. డబుల్ సెంచరీతో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
బాదుడే బాదుడు
సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ చెలరేగిపోయాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన వీరూ వారసుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ బాల్ నుంచే బాదుడు మొదలుపెట్టిన ఆర్యవీర్.. హాఫ్ సెంచరీ, సెంచరీ.. ఇలా మైల్‌స్టోన్స్ అన్నీ దాటుకుంటూ ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళ్లాడు. మేఘాలయతో మ్యాచ్‌లో మొత్తంగా 229 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్.. 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 2 సిక్సులతో పాటు ఏకంగా 34 బౌండరీలు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే అతడు 148 పరుగులు పిండుకోవడం విశేషం. ఆర్యవీర్ బాదుడుకు ప్రత్యర్థి బౌలర్లు గుడ్లు తేలేశారు. ఇదేం కొట్టుడు రా సామి అంటూ షాకయ్యారు.
తగ్గేదేలే
ఆర్యవీర్ దంచుడుతో ఢిల్లీ జట్టు 2 వికెట్లకు 468 పరుగులు చేసింది. మేఘాలయను 260 పరుగులకు కట్టడి చేసిన ఢిల్లీ.. మంచి లీడ్ సాధించింది. ఇక, సెహ్వాగ్ కొడుకు విధ్వంసంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆర్యవీర్ తండ్రికి తగ్గ తనయుడని సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. అతడు ఇదే ఆటతీరును కొనసాగిస్తే మరికొన్ని సంవత్సరాల్లో టీమిండియాలోకి అడుగుపెట్టడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. తగ్గేదేలే అంటూ అతడు దూసుకెళ్లాలని సూచిస్తున్నారు.
Also Read:
ఆస్ట్రేలియాకు రోహిత్ పయనం.. కానీ ఊహించని ట్విస్ట్
పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. మళ్లీ శనిలా దాపురించాడు
ఒలింపిక్స్ ఆతిథ్య రేసులో ఆగ్రా!
For More Sports And Telugu News