Share News

U19 World Cup: భారత్ vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలి?

ABN , Publish Date - Feb 11 , 2024 | 09:39 AM

అండర్ 19 ప్రపంచకప్‌లో తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్టు అమితుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా ఐదో సారి ఫైనల్ చేరిన భారత జట్టు తుది సమరంలో నెగ్గి ఆరోసారి ట్రోఫి నెగ్గాలని పట్టుదలగా ఉంది.

U19 World Cup: భారత్ vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలి?

బెనోని: అండర్ 19 ప్రపంచకప్‌లో తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్టు అమితుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా ఐదో సారి ఫైనల్ చేరిన భారత జట్టు తుది సమరంలో నెగ్గి ఆరోసారి ట్రోఫి నెగ్గాలని పట్టుదలగా ఉంది. ఆసీస్ కూడా ఫైనల్ పోరులో నెగ్గి నాలుగో సారి కప్ గెలవాలని భావిస్తోంది. టోర్నీలో రెండు జట్లు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరాయి. అండర్ 19 ప్రపంచకప్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడ్డాయి. 2012, 2018లో కంగారులను ఓడించి ట్రోఫిని ముద్దాడిన భారత్ ఒకసారి మాత్రం ఓడిపోయింది. కాగా గత నవంబర్‌లో జరిగిన సీనియర్ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లోనూ భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడిన సంగతి తెలిసిందే. దీంతో నాడు భారత సీనియర్ జట్టుకు ఎదురైన ఓటమికి నేడు యువ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.


సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ బెనోనిలోని విల్లోమూర్‌ పార్క్‌ స్టేడియం వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఫైనల్ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+హాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. టీవీల్లో మ్యాచ్ చూడాలనుకునేవారు స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2 చానెళ్లలో వీక్షించవచ్చు. మొబైల్స్‌లో అయితే డిస్నీ+హాట్‌స్టార్‌లో చూడొచ్చు. కాగా ఈ అండర్ 19 ప్రపంచకప్ మొత్తాన్ని ఇవే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.

తుది జట్లు (అంచనా)

భారత్‌: ఆదర్శ్‌, అర్షిన్‌, ముషీర్‌, ఉదయ్‌ సహరన్‌ (కెప్టెన్‌), మోలియా, సచిన్‌ దాస్‌, అవనీష్‌ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌, నమన్‌ తివారి, లింబానీ, పాండే.

ఆస్ట్రేలియా: డిక్సన్‌, సామ్‌, విబ్‌జన్‌ (కెప్టెన్‌), హర్జాస్‌ సింగ్‌, ర్యాన్‌ హిక్స్‌ (వికెట్‌ కీపర్‌), పీక్‌, క్యాంప్‌బెల్‌, మక్‌మిలన్‌, స్ట్రాకర్‌, మహ్లి బియార్డ్‌మన్‌, విడ్లర్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 10:04 AM