Yashasvi Jaiswal: టీమిండియా కొంపముంచిన జైస్వాల్.. ఆసీస్ నెత్తిన పాలు పోశాడు
ABN , Publish Date - Dec 27 , 2024 | 02:33 PM
Boxing Day Test: భలే ఆడుతున్నారు, కంగారూలను చావబాదుతున్నారు.. ఇక మ్యాచ్ మనదే అని అంతా అనుకున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కాలర్ ఎగరేశారు. కానీ ఒకే ఒక్క తప్పుతో భారత్ పుట్టి ముంచాడు యశస్వి జైస్వాల్. ఏంటా కాస్ట్‌లీ మిస్టేక్ అనేది ఇప్పుడు చూద్దాం..
IND vs AUS: భలే ఆడుతున్నారు, కంగారూలను చావబాదుతున్నారు.. ఇక మ్యాచ్ మనదే అని అంతా అనుకున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కాలర్ ఎగరేశారు. కానీ ఒకే ఒక్క తప్పుతో భారత్ పుట్టి ముంచాడు యశస్వి జైస్వాల్. అన్నీ సవ్యంగా సాగుతున్న సమయంలో ఆస్ట్రేలియా నెత్తిన పాలుపోశాడు. దీంతో బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆటలో పైచేయిగా ఉన్న టీమిండియా కాస్తా గేమ్ ముగిసేసరికి దిక్కుతోచని స్థితికి చేరుకుంది. చేతిలోకి వచ్చిన మ్యాచ్ దాదాపుగా జారిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రోహిత్ సేనను ఓటమి బారిన పడకుండా కాపాడటం క్లిష్టతరంగా మారింది. అసలు జైస్వాల్ చేసిన ఆ కాస్ట్‌లీ మిస్టేక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
సమన్వయ లోపం భారత్‌కు శాపం
మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (3) త్వరగా ఔట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో దిగిన కేఎల్ రాహుల్ (24) క్రీజులో సెటిల్ అయ్యాక వికెట్ పారేసుకున్నాడు. దీంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాల్సిన బాధ్యత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (36)తో పాటు మరో ఓపెనర్ జైస్వాల్ (82) మీద పడింది. వీళ్లిద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతూ మూడో వికెట్‌కు 102 పరుగులు జోడించారు. దీంతో 2 వికెట్లకు 153 పరుగులతో పటిష్ట స్థితిలో కనిపించింది టీమిండియా. ఈ సమయంలో సమన్వయ లోపం మెన్ ఇన్ బ్లూకు శాపంగా మారింది. అవనసర రన్‌కు ప్రయత్నించి జైస్వాల్ జట్టు కొంపముంచాడు.
రెప్పపాటులోనే..
బోలాండ్ బౌలింగ్‌లో బంతిని ఫ్లిక్ చేసిన జైస్వాల్ రన్ కోసం ప్రయత్నించాడు. కోహ్లీ కూడా ఒకట్రెండు అడుగులు ముందుకేశాడు. అయితే పరుగు కష్టమని భావించి వెనక్కి వెళ్లాడు. దీన్ని గమనించని జైస్వాల్ అడ్డదిడ్డంగా పరిగెత్తుకుంటూ నాన్‌స్ట్రయికర్ ఎండ్ వైపు వచ్చేశాడు. రెప్పపాటులో కమిన్స్ బాల్‌ను కీపర్ వైపు త్రో వేయడం, వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. అంతే తీవ్ర బాధతో క్రీజును వీడాడు జైస్వాల్. కోహ్లీ గట్టిగా హెచ్చరించినా, జైస్వాల్ నిశితంగా గమనించినా ఈ పొరపాటు జరిగేది కాదు. ఇది భారత్‌కు కాస్ట్‌లీ మిస్టేక్‌గా మారింది. ఇంకో 6 పరుగుల గ్యాప్‌లో కోహ్లీతో పాటు టెయిలెండర్ ఆకాశ్‌దీప్ ఔట్ అవడంతో 164/5తో డే2ను నిరాశతో ముగించింది భారత్. ఆసీస్ స్కోరుకు ఇంకా 310 పరుగుల దూరంలో ఉన్నాం కాబట్టి జైస్వాల్ రనౌట్ మ్యాచ్ డిసైడర్ అనే చెప్పాలి.
Also Read:
సెమీస్‌లో యూపీ, పట్నా
ఖలిస్థాన్ వాదులను అడ్డుకున్న ఫ్యాన్స్
సెమీ్‌సకు బెంగాల్
For More Sports And Telugu News