Share News

Yuvraj Singh: 43వ పడిలోకి యువరాజ్.. డాషింగ్ ఆల్‌రౌండర్ లైఫ్‌లోని 7 డార్క్ సీక్రెట్స్

ABN , Publish Date - Dec 12 , 2024 | 12:58 PM

Yuvraj Singh: భయానికే భయాన్ని పరిచయం చేసిన యోధుడు, బ్యాట్‌ను కరవాలంలా మార్చి యుద్ధం చేసిన వీరుడు, నెత్తురు కక్కుకుంటూనే విజయాన్ని ముద్దాడిన ధీరుడు, వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 43వ పడిలోకి అడుగుపెడుతున్న ఈ ఫైటర్‌ జీవితంలో ఎవరికీ తెలియని రహస్య కోణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Yuvraj Singh: 43వ పడిలోకి యువరాజ్.. డాషింగ్ ఆల్‌రౌండర్ లైఫ్‌లోని 7 డార్క్ సీక్రెట్స్
Yuvraj Singh

Yuvraj Singh Life Secrets: భయానికే భయాన్ని పరిచయం చేసిన యోధుడు, బ్యాట్‌ను కరవాలంలా మార్చి యుద్ధం చేసిన వీరుడు, నెత్తురు కక్కుకుంటూనే విజయాన్ని ముద్దాడిన ధీరుడు, వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ గురువారంతో 43వ పడిలోకి అడుగుపెడుతున్నాడీ పంజాబీ పుత్తర్. టీ20 ప్రపంచ కప్-2007తో పాటు వన్డే వరల్డ్ కప్‌-2011ను టీమిండియా ఒడిసిపట్టడంలో కీలక పాత్ర పోషించిన యువీ జీవితంలో చాలా మందికి తెలియని డార్క్ సైడ్ కూడా ఉంది. అతడి లైఫ్‌లోని ఆ రహస్య కోణం గురించి ఇప్పుడు చూద్దాం..

WhatsApp Image 2024-12-12 at 12.07.45.jpeg


  • యువరాజ్ క్రికెట్ ఘనతల గురించి క్రికెట్ లవర్స్‌కు బాగా తెలుసు. అయితే అతడి లైఫ్‌లోని గొడవలు, లవ్ ఎఫైర్స్ గురించి చాలా మందికి తెలియదు.

  • బయట కూల్‌గా, చిల్‌గా ఉండే యువీ.. గ్రౌండ్‌లోకి దిగితే మాత్రం అగ్రెసివ్‌గా మారిపోయేవాడు. ఈ క్రమంలో సొంత జట్టులోని ఆటగాళ్లతో బాహాబాహీకి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

  • లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో యువీ మొదట్లో చాలా స్నేహంగా ఉండేవాడు. ఆ తర్వాత పలు వివాదాల కారణంగా ఇద్దరి మధ్య అంతగా సఖ్యత లేదని చెబుతుంటారు.


  • ధోనీతో యువీ ఎప్పుడూ నేరుగా గొడవకు దిగింది లేదు. కానీ వరల్డ్ కప్ క్రెడిట్ కొట్టేశాడని, అతడి రిటైర్మెంట్‌కు మాహీనే కారణమని ఇప్పటికీ యువరాజ్ ఫ్యాన్స్ ఆరోపిస్తుంటారు.

  • క్లోజ్ ఫ్రెండ్ అయిన హర్భజన్ సింగ్‌తో పాటు గౌతం గంభీర్, శ్రీశాంత్ లాంటి వారితోనూ కొన్ని సందర్భాల్లో యువీ ఫైట్‌కు దిగాడు. శ్రీలంకతో వన్డే మ్యాచ్‌లో భజ్జీతో అతడు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

  • 2008లో గంభీర్‌‌కు యువీకి మధ్య కూడా చిన్న ఫైట్ జరిగింది. యువరాజ్‌కు అహంకారం ఎక్కువ అని అప్పట్లో ప్రచారం నడిచింది.


  • 2012లో ఒక నైట్ క్లబ్‌లో ఓ 19 ఏళ్ల కుర్రాడితో యువీ గొడవకు దిగడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.

  • 2014లో సెల్ఫీ అడిగిన ఓ అభిమానిని యువీ చెంపదెబ్బ కొట్టడం వైరల్ అయింది. అయితే ఇందులో అసలు ఏం జరిగింది? భారత క్రికెటర్‌దే తప్పా? అనేది క్లారిటీ లేదు.

  • 2017లో ఒక బిజినెస్‌మెన్‌తోనూ యువీ గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి. వ్యాపారంలో వచ్చిన తేడాలు కాస్తా ఫైట్‌కు దారితీశాయని అంటుంటారు.

    WhatsApp Image 2024-12-12 at 12.10.28.jpeg


  • యువరాజ్‌ అంటే అప్పట్లో అమ్మాయిలు పడిచచ్చేవారు. చాలా మందికి అతడు డ్రీమ్ బాయ్.

  • బాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోయిన్లతో అఫైర్లు నడిపాడు యువీ. ‘ఖడ్గం’ ఫేమ్ కిమ్ శర్మతో చాన్నాళ్లు లవ్‌లో ఉన్నాడు.

  • స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతోనూ యువీ గాఢమైన ప్రేమ బంధంలో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ఆంచల్ కుమార్, రియా సేన్ లాంటి ఇతర బాలీవుడ్ భామలతోనూ అతడు ఎఫైర్లు నడిపినట్లు చెబుతుంటారు. అయితే ఆఖరికి హేజల్‌కీచ్‌‌ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు.

    WhatsApp Image 2024-12-12 at 12.08.41.jpeg


Also Read:
దిగజారిన కోహ్లీ, రోహిత్‌ ర్యాంకులు

గాయత్రి జోడీకి నిరాశ

టీఓఏ పీఠంపై జితేందర్‌
For More
Sports And Telugu News

Updated Date - Dec 12 , 2024 | 01:16 PM