India: పాకిస్థాన్‌లో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందా..? ఐసీసీకి పీసీబీ కీలక సూచన..?
ABN , Publish Date - May 02 , 2024 | 11:02 AM
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫి పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. ఆసియా కప్ సమయంలో వేదికల గురించి ఇండియా, పాకిస్థాన్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్‌లో భారత్ ఆడుతుందా..? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫి (Champions Trophy) పాకిస్థాన్‌లో (Pakistan) జరగాల్సి ఉంది. ఆసియా కప్ సమయంలో వేదికల గురించి ఇండియా (India), పాకిస్థాన్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్‌లో భారత్ ఆడుతుందా..? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు పీసీబీ బోర్డు కీలక సూచన చేసింది.
ఏంటంటే..?
ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్‌లను కరాచీ, రావాల్పిండి, లాహోర్‌లలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహిస్తోంది. లాహోర్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇటీవల ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ పాకిస్థాన్‌లో పర్యటించారు. ఛాంపియన్స్ ట్రోఫి నిర్వహించే ప్రదేశాలను సందర్శించారు. ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ ఆడుతుందా అనే సందేహాలు వచ్చాయి. ఇంతలో పీసీబీ ఐసీసీకి ఓ ప్రతిపాదన చేసింది. నాకౌట్ దశలో ఇండియా ఒకే వేదిక మీద కరాచీలో ఆడాలని కోరింది.
ఓకే వేదికలో ఆడాలని రిక్వెస్ట్
తమ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫి జరుగుతున్నందున ఇండియా ఎలాగైనా ఆడాలని పాకిస్థాన్ పట్టుబడుతుంది. నాకౌట్ దశలో ఓకే వేదికలో ఆడాలని ప్రతిపాదన చేసింది. గత ఏడాది ఆసియా కప్ సమయంలో వేదికల గురించి ఇరుదేశాల మధ్య గొడవ జరిగింది. 2008 తర్వాత నుంచి పాకిస్థాన్‌లో భారత్ మ్యాచ్ ఆడలేదు. ఈ సారి ఎలాగైనా సరే భారత్‌ను రప్పించాలని పీసీబీ శక్తి మేర ప్రయత్నాలు చేస్తోంది. అందుకే కీలక ప్రతిపాదన చేసింది. ఈ అంశంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Latest Sports News and Telugu News