Share News

IPL 2024: నేడు CSK vs RR కీలక మ్యాచ్..సొంత మైదానంలో ఓడితే కష్టమేనా?

ABN , Publish Date - May 12 , 2024 | 10:27 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 61వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి కీలకమని చెప్పవచ్చు. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.

 IPL 2024: నేడు CSK vs RR కీలక మ్యాచ్..సొంత మైదానంలో ఓడితే కష్టమేనా?
ipl 2024 CSK vs RR today is a crucial 61st match

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 61వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే 6 మ్యాచ్‌లు గెలిచిన చెన్నై ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే వచ్చే రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. ఆ జట్టు గత ఐదు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించింది. కాగా రాజస్థాన్ 8 మ్యాచ్‌ల్లో గెలుపొంది, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ దాదాపు ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.


పిచ్ రిపోర్ట్

ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. అయితే బౌలర్లు ఇక్కడ మరింత సపోర్ట్ పొందుతారు. ముఖ్యంగా స్పిన్నర్లకు మంచి టర్న్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు 183గా ఉంది. ఇక్కడ టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. టాస్‌ గెలిచిన తర్వాత జట్టు ముందుగా బౌలింగ్‌కే మొగ్గు చూపుతుంది. ఈ మైదానంలో చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నై(CSK), పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSK 162/7 పరుగులు చేసింది. అనంతరం 17.5 ఓవర్లలో పంజాబ్ లక్ష్యాన్ని ఛేదించింది.


వర్షం పాడు చేస్తుందా?

ఆదివారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు(rain) పడే అవకాశం ఉంది. చెన్నైలో దాదాపు 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. తేమ దాదాపు 69% ఉంటుంది. వెదర్ రిపోర్ట్ ప్రకారం వర్షం పడే అవకాశం 6% ఉంది. ఇక నేటి మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ 50 శాతం గెలిచే అవకాశం ఉండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా 50 శాతం ఛాన్స్ ఉంది.


చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్రాబబుల్ 11లో రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్స్ అజింక్యా రహానే, సమీర్ రిజ్వీ ఉన్నారు.

రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) ప్రాబబుల్ 11లో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, డోనోవన్ ఫెరీరా, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ జోస్ బట్లర్ కలరు.


ఇది కూడా చదవండి:

కోల్‌కతాదే తొలి అడుగు


Viral Video: మ్యాచ్ మధ్యలో పరిగెత్తుకెళ్లి ధోని కాళ్లపై పడిన వీరాభిమాని

Read Latest Sports News and Telugu News

Updated Date - May 12 , 2024 | 10:29 AM