Paris Olympics 2024: కాలుష్యం ఎఫెక్ట్ ట్రయాథ్లాన్ శిక్షణ రద్దు చేసిన ఒలంపిక్స్ నిర్వాహకులు.. మళ్లీ విమర్శలు
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:52 PM
పారిస్ ఒలింపిక్స్ 2024లో(Paris Olympics 2024) మారథాన్ స్విమ్మర్లు, ట్రయాథ్లెట్ల ఈవెంట్‌లు సెయిన్ నది(Seine river)లో జరుగనుండగా కాలుష్యం కారణంగా మొదటి శిక్షణా సెషన్‌ను ఆదివారం రద్దు చేశారు. ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో నిరంతరంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నీటి కాలుష్య ప్రభావంపై ఆందోళనలు వచ్చిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో(Paris Olympics 2024) మారథాన్ స్విమ్మర్లు, ట్రయాథ్లెట్ల ఈవెంట్‌లు సెయిన్ నది(Seine river)లో జరుగనుండగా కాలుష్యం కారణంగా మొదటి శిక్షణా సెషన్‌ను ఆదివారం రద్దు చేశారు. ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో నిరంతరంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నీటి కాలుష్య(water pollution) ప్రభావంపై ఆందోళనలు వచ్చిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీటి నాణ్యత(water quality) పరీక్షల తర్వాత అధికారులు ట్రైథ్లాన్ ఓరియంటేషన్ స్విమ్మింగ్ భాగాన్ని రద్దు చేయడానికి ఉమ్మడి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
వరల్డ్ ట్రయాథ్లాన్ పారిస్ 2024 ఆర్గనైజింగ్ కమిటీ ప్రకారం నీటి నాణ్యత తగ్గిన క్రమంలో ఈవెంట్‌ను నిర్వహించడానికి అంగీకరించలేమన్నారు. రాబోయే రెండు రోజుల అనుకూల వాతావరణ సూచనల తర్వాత తిరిగి ట్రయాథ్లాన్ పోటీలు నిర్వహించే అవకాశం ఉందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.
కొద్ది రోజుల ముందు
జులై మధ్య నుంచి పరీక్షలలో ఈ నదిలో ఈత కొట్టడానికి నది తగినంత శుభ్రంగా ఉందని ప్రకటించబడింది. అయితే ఈ జలాలు మరికొన్ని రోజుల్లో మళ్లీ పోటీకి సరిపోతాయా లేదా అనే సందేహాలు కూడా మళ్లీ లేవనెత్తుతున్నారు క్రీడా వర్గాలు. పారిస్ ఒలింపిక్స్‌లో మారథాన్ స్విమ్మర్లు, ట్రయాథ్లెట్ల ఈవెంట్‌లు సీన్ నది(Seine river)లో జరుగుతాయని గతంలో ప్రకటించారు. ఘోరమైన కాలుష్యం కారణంగా ఈ నదిలో ఈత కొట్టడాన్ని దాదాపు 100 సంవత్సరాలకు పైగా నిషేధించబడింది.
ఒలింపిక్ క్రీడలు ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఈ నదిలో అసురక్షిత స్థాయిలో బ్యాక్టీరియాను గుర్తించారు. ఆ సమయంలో కూడా క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాల కంటే తక్కువగా ఉంటే "ప్లాన్ B"లో ఈవెంట్‌లను కొన్ని రోజులు వాయిదా వేయడం లేదా మారథాన్ స్విమ్మింగ్‌ను పారిస్‌కు తూర్పున ఉన్న మార్నే నదిపై వైరెస్ సుర్ మార్నేకి తరలించడం వంటివి ఉంటాయని అధికారులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Paris Olympics 2024: పారిస్ ఒలంపిక్స్‌లో తొలిరోజు ఆస్ట్రేలియాకు 5 మెడల్స్.. భారత్ విషయానికొస్తే..
నిర్వహించడం కష్టమని
పారిస్ ఒలింపిక్ క్రీడలు(Paris Olympics 2024) 2024 జులై 26న మొదలు కాగా, ఇవి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఈ క్రమంలో 329 ఈవెంట్లలో 10,500 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. మారథాన్ స్విమ్మర్లు, ట్రయాథ్లెట్ల పోటీలు సెయిన్ నదిలో జరగనున్నాయి. నది ఘోరమైన కాలుష్యం కారణంగా ఈ ఈవెంట్లు నిర్వహించడం చాలా కష్టమని పలువురు చెబుతున్నారు. అలా చేయడం వల్ల అథ్లెట్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
సెయిన్ నదిలో ఈత కొట్టడం 100 సంవత్సరాలకు పైగా నిషేధించబడింది. ఒలింపిక్ క్రీడలకు ముందు నదిని శుభ్రపరచడానికి సుమారు రూ. 125 బిలియన్లు వెచ్చించి పరిశుభ్రం చేశారు. అయినప్పటికీ ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇటివల ప్రారంభోత్సవ వేడుకల వేళ వినూత్న ప్రదర్శనలతో విమర్శలు ఎదుర్కొన్న ఈ ఒలంపిక్స్ క్రీడలు.. ఇప్పుడు నది కాలుష్యం గురించి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
Womens Asia Cup Final: నేడు మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్ పోరు.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే..
Paris Olympics : తొలి స్వర్ణం చైనా ఖాతాలో..
first T20 India vs Sri Lanka : ‘టాప్’షోతో బోణీ
Read Latest Sports News and Telugu News