Virat Kohli: ముంబైలో సెలబ్రేషన్స్ పూర్తైన వెంటనే రాత్రికి రాత్రే లండన్ బయలుదేరిన కోహ్లీ
ABN , Publish Date - Jul 05 , 2024 | 09:44 AM
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) విశ్రాంతి లేకుండా గడుపుతున్నాడు. బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ నిన్న ముంబైలో జరిగిన వేడుకల్లో రాత్రి పాల్గొన్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే లండన్(London) బయలుదేరి వెళ్లారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) విశ్రాంతి లేకుండా గడుపుతున్నాడు. బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ నిన్న ముంబైలో జరిగిన వేడుకల్లో రాత్రి పాల్గొన్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే లండన్(London) బయలుదేరి వెళ్లారు. అయితే ఇటివల తుపాను కారణంగా బార్బడోస్‌లో టీమిండియాతో పాటు విరాట్ కోహ్లీ కూడా చిక్కుకుపోయాడు. తుఫాను తగ్గిన వెంటనే, విరాట్ సహా టీమిండియా జూలై 4న భారతదేశానికి తిరిగి వచ్చి, రోజంతా T20 ప్రపంచ కప్ సంబరాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కోహ్లీ విదేశీ పర్యటనకు వెళ్లడం విశేషం. అయితే ఇది తెలిసిన నెటిజన్లు కోహ్లీ ఎందుకు వెళ్లాడని ఆరా తీస్తున్నారు.
విరాట్ తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకునేందుకు లండన్(London) వెళ్లినట్లు తెలుస్తోంది. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం పిల్లలతో లండన్‌లో ఉన్నారు. అందుకే ఆమెను కలిసేందుకు ముంబై నుంచి రాత్రికి రాత్రే లండన్ వెళ్లిపోయాడు. వాంఖడే స్టేడియంలో విజయోత్సవ పరేడ్, సన్మాన కార్యక్రమం తర్వాత, కోహ్లీ ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. ఇది తెలిసిన నెటిజన్లు ఇటు టీమిండియాకు, అటు ఫ్యామిలీకి విరాట్ కరెక్టుగా న్యాయం చేస్తున్నారని అంటున్నారు.
విరాట్ కోహ్లీ లండన్ వెళ్లే ముందు ముంబై(mumbai)లో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. మెరైన్ డ్రైవ్‌లో జరిగిన విజయోత్సవ పరేడ్‌లో లక్షలాది మంది అభిమానుల మధ్య వందమాతరం నినాదాలు చేశారు. విరాట్, రోహిత్ కలిసి ట్రోఫీని ఎత్తుకుని అభిమానులను చూసి పెద్దగా కేకలు వేశారు. దీని తర్వాత ప్రపంచ ఛాంపియన్ జట్టు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకోగానే, వేలాది మంది అభిమానులు వారిద్దరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ సమయంలో కోహ్లీ తాను డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వస్తున్న సమయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఏడుస్తున్నారని, ఆపై కౌగిలించుకున్నారని కోహ్లీ చెప్పాడు. ఈ క్షణం జీవితాంతం తనతోనే ఉంటుందని కోహ్లీ అన్నారు.
ఇది కూడా చదవండి:
UK Elections 2024: యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ గ్రాండ్ విక్టరీ.. రిషి సునాక్ పార్టీ..
UK: యూకే ఎన్నికల్లో ఈ పార్టీదే ఆధిపత్యం.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
Read Latest Sports News and Telugu News