Share News

Olympic Games Paris 2024: పతకాల పట్టికలో తొలిరోజు భారత్ ఖాతా తెరుస్తుందా.. ఆశలన్నీ వాళ్లపైనే..

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:29 AM

పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.

Olympic Games Paris 2024: పతకాల పట్టికలో తొలిరోజు భారత్ ఖాతా తెరుస్తుందా.. ఆశలన్నీ వాళ్లపైనే..
Paris Olympics

పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. తొలిరోజు షూటింగ్‌కు సంబంధించిన ఈవెంట్‌లో భారత్ పాల్గొంటుంది. మొదట జరిగే క్వాలీఫైర్ రౌండ్‌లో క్వాలీఫై అయితే పతకం సాధించే అవకాశాలున్నాయి. మొత్తం 117 మంది క్రీడాకారులు భారత్ నుంచి పాల్గొంటున్నారు. 16 విభాగాల్లో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించననున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, ఆర్చరీ విభాగాల్లో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశాలున్నాయని క్రీడారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఒలింపిక్స్‌లో 7 పతకాలు రాగా.. ఈసారి రెండంకెల సంఖ్యను చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి.

Olympic Games : ఆరంభ సంబరం పారిస్‌ పరవశం


మధ్యాహ్నం నుంచి..

మధ్యాహ్నం 3 గంటల నుంచి భారత్ క్రీడాకారుల టెన్నిస్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. టెన్నిస్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ నాగల్, పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న ఎన్ శ్రీరామ్ బాలాజీ జోడి పోటీపడతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 10 మీటర్ల ఈథర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ చీమాలు పోటీ పడనున్నారు. ఈ ఈవెంట్ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ రౌండ్‌లో రిథమ్ సాంగ్వాన్ మను భాకర్ పోటీ పడనున్నారు.

T20 World Champion : కొత్త.. కొత్తగా


షూటింగ్‌లో పతకంపై ఆశలు..

బ్యాడ్మింటన్, రోయింగ్, షూటింగ్ ఈవెంట్‌లు ఈరోజు జరగనున్నాయి. రోవింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ హిట్స్ రౌండ్‌లో బలరాజ్ పన్వార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సందీప్ సింగ్, అర్జున్ బాబౌటా, రమితా జిందాల్, ఎలవెనిల్ వలరివన్ పోటీపడతారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఈ జట్టు అర్హత సాధిస్తే మధ్యాహ్నం షూటింగ్‌లో పతకం సాధించే అవకాశం ఉంటుంది. తొలిరోజు షూటింగ్‌లోనే భారత్ పతకం సాధించే అవకాశాలు ఉన్నాయి.

Olympic Games Paris 2024: ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో గందరగోళం.. పడవ ఎక్కకుండా క్రీడాకారులను అడ్డుకున్న అధికారులు..


నేడు భారత్ షెడ్యూల్..

భారత అథ్లెట్లు శనివారం మొత్తం 7 విభాగాల్లో ఆడనున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తానీసా క్రెస్టో జోడీ బరిలోకి దిగనుంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో ఎస్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్‌లు పోటీపడనున్నారు. కాగా, మహిళల సింగిల్స్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు పోటీపడనుంది. బ్యాడ్మింటన్ లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. రెండింటిలో విజయం సాధిస్తే క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. బ్యాడ్మింటన్‌లో కనీసం రెండు నుంచి మూడు పతకాలు వస్తాయని భారత్ ఆశలు పెట్టుకుంది.


వేలంలో ద్రవిడ్‌ కొడుక్కి రూ.50 వేలు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jul 27 , 2024 | 09:29 AM