Share News

ECG Machines: ఉస్మానియాలో అందుబాటులోకి 15 ఈసీజీ యంత్రాలు

ABN , Publish Date - Dec 17 , 2024 | 04:47 AM

ఉస్మానియాలో రోగులకు 15 ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ‘గుండెను పరీక్షించలేని ఉస్మానియా’ శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం ప్రచురితమైంది.

ECG Machines: ఉస్మానియాలో అందుబాటులోకి 15 ఈసీజీ యంత్రాలు

  • ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన అధికారులు

  • హర్షం వ్యక్తం చేసిన రోగులు

మంగళ్‌హాట్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియాలో రోగులకు 15 ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ‘గుండెను పరీక్షించలేని ఉస్మానియా’ శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈసీజీ యంత్రాలు పనిచేయకపోవడంతో గంటల తరబడి ఔట్‌ పేషెంట్‌ విభాగంలో ఈసీజీ కోసం వేచి చూస్తున్న రోగుల కష్టాలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకు వచ్చింది. దాంతో అధికారులు స్పందించారు. పాడైన రెండు ఈసీజీలకు కొత్త కెబుళ్లను తెప్పించి వాటిని బాగు చేయించారు.


అదే విధంగా గోదాంలో కొద్ది రోజులుగా దాచి ఉంచిన రెండు కొత్త ఈసీజీ యంత్రాలను బయటకు తీసి అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో ఐదింటిని బాగు చేయించేందుకు టెక్నిషియన్లను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం 15 యంత్రాలు వాడుకలోకి తీసుకురాగా మరో 7 మాత్రం ఇంకా బాగు చేయించాల్సి ఉందని ఉస్మానియా అధికారులు తెలిపారు. మొత్తానికి ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి రావడంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 17 , 2024 | 04:47 AM