Share News

Kavitha: ఎట్టకేలకు కల్వకుంట్ల కవితకు బెయిల్

ABN , Publish Date - Aug 27 , 2024 | 01:22 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు ఊరట కలిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో గత 150 రోజులకు పైగా జైలులో ఉన్న కవిత బెయిల్ మీద బయటకు వస్తోన్నారు. ఈడీ కేసులో మాత్రమే కవితకు బెయిల్ లభించింది.

Kavitha: ఎట్టకేలకు కల్వకుంట్ల కవితకు బెయిల్
Kavitha

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha) ఎట్టకేలకు ఊరట కలిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో గత 150 రోజులకు పైగా జైలులో ఉన్న కవిత బెయిల్ మీద బయటకు వస్తోన్నారు. ఈడీ కేసులో మాత్రమే కవితకు బెయిల్ లభించింది. సీబీఐ కేసులో కూడా బెయిల్ రావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉందని మార్చి 15వ తేదీన సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ రోజు రాత్రి ప్రత్యేక విమానంలో కవితను ఢిల్లీకి తరలించారు. ఆ రోజు నుంచి కవిత తీహార్ జైలులో ఉన్నారు.


kavitha-ktr-harish.jpg


  • ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామాలు

  • లిక్కర్ స్కామ్‌లో కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. 10 రోజుల ముందు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు.

  • 2022 జూలై నెలలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 5 నెలల తర్వాత డిసెంబర్ 11వ తేదీన.. సీఆర్పీపీసీ 160 కింద కవితకు నోటీసులు ఇచ్చి ఇంట్లో సీబీఐ అధికారులు విచారించారు. 7 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించి, వాంగ్మూలం నమోదు చేశారు.

  • సీబీఐ తర్వాత రంగంలోకి దిగిన ఈడీ.. 2023 మార్చి11వ తేదీన ఈడీ విచారణకు హాజరైన కవిత.

  • 2023 మార్చి 16, 20, 21వ తేదీల్లో కవితను ఢిల్లీలో విచారించిన ఈడీ అధికారులు

  • లిక్కర్ పాలసీ కేసులో 2024 ఏప్రిల్ 15వ తేదీన కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

  • 5 నెలలుగా రిమాండ్ ఖైదీగా కల్వకుంట్ల కవిత

  • 11 కేజీల బరువు తగ్గిన కవిత

  • జైలులో కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు.


supreme court.jpg


లిక్కర్ పాలసీ అంటే..

2021 ముందు వరకు ఢిల్లీలో మద్యం దుకాణాలను అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వమే నిర్వహించేది. తర్వాత కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఢిల్లీలో ఉన్న 32 జోన్లలో 849 మద్యం షాపులు తెరవాల్సి ఉంది. ఒక్కో మండలంలో 27 మద్యం షాపులు ఉండేలా.. 8 నుంచి 10 వార్డులుగా విభజించారు. ఎక్సైజ్ పాలసీ నిబంధనలకు లోబడి మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లో వైన్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. 2022 నవంబర్ 17వ తేదీన ఎక్సైజ్ పాలసీ అమలు చేశారు. పాలసీ అమలు చేయడానికి 2 రోజుల ముందు లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తన వైఖరి మార్చుకున్నారని అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చినా వీకే సక్సేనా ఎక్సైజ్ పాలసీ 2021-22లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. ఢిల్లీ విద్యాశాఖ, ఎక్సైజ్‌శాఖ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. మద్యం పాలసీలో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపించింది. ఎక్సైజ్ అధికారులు, రాజకీయ నేతలకు కోట్ల రూపాయల ముడుపులు అందాయని పేర్కొంది. సిసోడియాకు అనుచరుడు దినేశ్ అరోరాకు చెందిన రాధా ఇండస్ట్రీస్ ఖాతాలకు కోటి రూపాయలు ముడుపులు అందాయని సీబీఐ తెలిపింది.


కీలక భేటీ..

2021 మే నెలలో ఢిల్లీ గౌరి అపార్ట్ మెంట్ వద్ద జరిగిన సమావేశంలో పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు, ఆప్ నుంచి విజయ్ నాయర్ పాల్గొన్నారని ఈడీ తెలిపింది. జూన్‌లో వీరు ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి మధ్య సమావేశం ఏర్పాటు చేశారని ఈడీ పేర్కొంది. 2021 సెప్టెంబర్‌లో పిళమ్లై, బుచ్చిబాబు, అభిషేక్ తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో బినయ్ బాబు, మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి లిక్కర్ వ్యాపారం గురించి డిస్కష్ చేశారని వివరించింది. హోటల్ రికార్డులు, వీడియో ఫుటేజీ ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత హైదరాబాద్ ఐటీసీ కోహినూర్‌లో భేటీ అయ్యారని.. రూ.321 కోట్లను అభిషేక్, దినేశ్ అరారో కలిసి ఆప్‌కు బదిలీ చేశారని వివరించింది. ఒప్పందంలో భాగంగానే సమీరు మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్స్‌లో సౌత్ గ్రూపునకు దక్కిన 65 శాతం వాటాలో పిళ్లైకు 32.5 శాతం దక్కిందట. ఇతను కవిత బినామీ అని చెప్పింది. ఇండో స్పిరిట్ కంపెనీలో షేర్ హోల్డర్‌గా కవిత కాగితాల మీద చూపించడానికి రూ.3.20 కోట్లలో రూ.కోటి సమకూర్చారని తెలిపింది. 9 రిటైల్ జోన్లకు లైసెన్స్ రావడానికి పిళ్లై.. ఆప్ పెద్దలు, సౌత్ గ్రూపు సభ్యులకు మధ్యవర్తిగా వ్యవహరించారట.


ఒప్పందం ఇలా..

ఒప్పందంలో భాగంగా హోల్ సేల్ లిక్కర్ కంపెనీల లాభాల వాటా 12 శాతం పెంచుతూ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పులు జరిగాయని ఈడీ తెలిపింది. తొలి మూడు స్థానాల్లో నిలిచి, లైసెన్స్ పొందిన ఇండో స్పిరిట్స్, బ్రిండ్ కో, మహదేవ్ లిక్కర్స్ వ్యాపారం రూ.3500 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో 12 శాతం వాటా రూ.420 కోట్లు అయితే.. తిరిగి 6 శాతం రూ.210 కోట్లు ఆప్ నేతలకు ముడుపులు చెల్లించాలనే ఒప్పందంలో భాగం అని ఈడీ చెబుతోంది. పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈడీ తరఫున సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్ రూ. 100 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని పేర్కొంది. పిళ్లై రూ.296.2 కోట్ల మేర ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్స్ పాల్పడినట్టు పేర్కొంది.

ఇదికూడా చదవండి: Hyderabad: హైడ్రాకు ప్రజలందరూ మద్దతివ్వాలి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2024 | 02:05 PM