Share News

Lok Sabha Election 2024:కాంగ్రెస్ కీలక నేతపై కేసు.. కారణమిదే..?

ABN , Publish Date - May 11 , 2024 | 10:16 PM

తెలంగాణలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు హోరాహోరీగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో అక్కడక్కడ పలు ఘర్షణలు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో ఈ నెల 9వ తేదీన భారీ రోడ్ షో‌ నిర్వహించారు.

Lok Sabha Election 2024:కాంగ్రెస్ కీలక నేతపై కేసు.. కారణమిదే..?

హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు హోరాహోరీగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో అక్కడక్కడ పలు ఘర్షణలు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో ఈ నెల 9వ తేదీన భారీ రోడ్ షో‌ నిర్వహించారు. అయితే ఈ సమయంలో ఓ వ్యక్తి మాగంటిపై చెప్పువిసిరాడు.చెప్పు విసిరిన ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.


వివరాల్లోకి వెళ్తే... ఈనెల 9న రాత్రి బీఆర్ఎస్ తరపున బోరబండలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో మాగంటి వెళ్తుండగా హైటెక్ హోటల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ రోడ్ షో మీద చెప్పు విసరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.


ఈ ఘటనకు కారణమైన వ్యక్తితో పాటు అనుమతి లేకుండా కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసిన నిర్వాహకుడు ఎస్ లావేష్ మీద ఎన్నికల పరిశీలకురాలు అనితా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఐపీసీ188, 290, 341తో పాటు 127 ఎఫ్‌ఆర్పీ యాక్ట్ కింద బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ సేకరించారు. సీసీ ఫుటేజ్‌లో చెప్పు విసిరిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - May 11 , 2024 | 10:23 PM